- సాగునీటి సంఘాల ఎన్నికలకు కసరత్తు
- 25లోగా ఓటర్ల జాబితా తయారీకి ఆదేశాలు
- ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించాలంటున్న రైతు సంఘాలు
‘సాగు నీటి’లో ఎన్నికల వేడి
Published Tue, May 9 2017 11:50 PM | Last Updated on Tue, Aug 14 2018 4:44 PM
మండపేట :
సాగునీటి సంఘాల ఎన్నికలకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. గ్రామ స్థాయిలో ఓటర్ల జాబితాలను సిద్ధం చేసేందుకు ఆదేశాలిచ్చింది. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో గత నీటి సంఘాల ఎన్నికలు ఏకపక్షంగా సాగాయని, ఈసారైనా ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నీటి సంఘాల రెండేళ్ల పదవీకాలం దగ్గరపడుతుండటంతో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లాలోని మేజర్, మీడియం, మైనర్ ప్రాజెక్టులకు సంబంధించి గోదావరి తూర్పు డెల్టా పరిధిలో 74 నీటి సంఘాలుండగా, గోదావరి మధ్య డెల్టా పరిధిలో
104, పెద్దాపురం డివిజ¯ŒS పరిధిలో 168, రంపచోడవరం పరిధిలో 55 కలిపి మొత్తం 401 నీటి సంఘాలున్నాయి. వాటి పరిధిలో 30 డిస్ట్రిబ్యూటరీ కమిటీలుండగా, ఐదు ప్రాజెక్టు కమిటీలున్నాయి. ఆయా సంఘాలకు సంబం ధించిన ఓటర్ల జాబితాలను ఈ నెల 25వ తేదీలోగా తయారు చేయాలని తాజాగా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఆయకట్టు రైతులను గుర్తించి వారిని ఓటర్లుగా చేరుస్తూ నిర్ణీత గడువులోగా అధికారులు జాబితాలను రూపొందించాల్సి ఉంది.
ఎన్నిక తీరు ఇలా...
నీటి సంఘాల పరిధిలో ఆరుగురు సభ్యులుంటారు. ఆయా సంఘాల అధ్యక్షులు డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులను ఎన్నుకుంటారు. డీసీ అధ్యక్షులు ప్రాజెక్టు కమిటీ అధ్యక్షులను ఎన్నుకుంటారు. ఈ నెల 25వ తేదీ నాటికి ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాల్సి ఉంది. అయితే ఓటర్ల జాబితాలు నిష్పక్షపాతంగా తయారు చేయాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ఏకాభిప్రాయం కాదు.. అంతా ఏకపక్షమే
సాగునీటి సంఘాల ఎన్నికలు తప్పనిసరి చేయాలంటూ రెండేళ్ల కిందట సుప్రీంకోర్టు ఆదేశాలు నేపథ్యంలో 2015 సెప్టెంబరులో ఎన్నికల నిర్వహణకు చంద్రబాబు సర్కారు హడావిడిగా ఏర్పాట్లు చేసింది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, ఎన్నికల ప్రక్రియను ఎగతాళి చేస్తూ అంతా ఏకపక్షంగా సాగించింది. ఎన్నికలను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ఏపీ ఫార్మర్స్ మేనేజ్‌మెంట్ ఆఫ్ ఇరిగేష¯ŒS సిస్టమ్స్ యాక్టు –1997కు సవరణ చేసి ఏకాభిప్రాయం పేరిట చంద్రబాబు సర్కారు చీకటి జీవోను విడుదల చేసింది. రైతుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే అప్పుడు ఏమి చేయాలనే విషయమై జీవోలో స్పష్టత ఇవ్వకపోవడాన్ని అధికారపార్టీ నేతలు ఆసరాగా చేసుకున్నారు. ఏకాభిప్రాయం ముసుగులో తమ అనుయాయులకు పదవులు కట్టబెట్టుకున్నారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తినా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అడ్డగించినా ఎన్నికలు జరిపించేశారు. అప్పట్లో జిల్లాలోని మండపేట మండలం పాలతోడు, రాయవరం మండలం చెల్లూరు, పసలపూడి, ఏలేశ్వరం, జగ్గంపేట, కిర్లంపూడి మండలంలోని పలు గ్రామాల్లోను, ఏలేరు ఆయకట్టు పరిధిలోను, కరప మండలం యండమూరు, కాజులూరు మండలం పల్లిపాలెం, అల్లవరం మండలం తాడికోన, దేవగుప్తం, బిక్కవోలు మండలం బలభద్రపురం, అయినవిల్లి మండలం నేదునూరు తదితర గ్రామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గట్టిగా ప్రతిఘటించడంతో ఉన్నతాధికారులకు నివేదిస్తామంటూ అక్కడి నుంచి అధికారులు వెనుతిరిగారు. అయితే తర్వాత చాలాచోట్ల అధికారులు టీడీపీ నేతల ప్యానెల్‌కే పట్టం కట్టడం అధికార పార్టీ పచ్చపాతానికి పరాకాష్టగా నిలిచింది. ప్రభుత్వ తీరుపై అప్పట్లో రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది.పలువురు ఎన్నికలను సవాల్ చేస్తూ కోర్టులను ఆశ్రయించారు.
నిష్పక్షపాతంగా జాబితాలు తయారు చేయాలి
ఇప్పటికైనా ప్రజాస్వామ్య పద్ధతిలో పాత ఏపీఎఫ్‌ఐఎంఎస్ యాక్టు ప్రకారం ఎన్నికలు జరపాలి. ఓటర్ల జాబితాలను పారదర్శకంగా తయారుచేయాలి.
– కొవ్వూరి త్రినాధరెడ్డి, వైఎస్సార్ సీపీ రైతు, విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి
ఓటర్ల జాబితాలు సిద్ధం చేస్తున్నాం
నీటి సంఘాలకు సంబంధించి ఓటర్ల జాబితాను సిద్ధ చేయాలని ఉన్నతస్థాయి నుంచి ఆదేశాలందాయి. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నాం.
– రాంబాబు, ఇరిగేష¯ŒS సర్కిల్ ఎస్‌ఈ.
Advertisement
Advertisement