పాముకాటుతో యువతి మృతి
Published Mon, Apr 3 2017 12:30 AM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM
గుండ్రేవుల(సి.బెళగల్): మండల పరిధిలోని గుండ్రేవుల గ్రామానికి చెందిన యువతి పాముకాటుతో మృతిచెందింది. శనివారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉనా్నయి. క్రిష్ణదొడ్డి గ్రామానికి చెందిన రామాంజనేయులు,లక్ష్మీల కూతురు అయిన పుష్పావతికి గుండ్రేవుల గ్రామానికి చెందిన బడేసావ్, బీసమ్మ దంపతుల చిన్న కుమారుడు ఆంజనేయులుతో రెండేళ్ల క్రితం వివాహమైంది. శనివారం రాత్రి 8 గంటల సమయంలో ఇంటి ఎదుట పనులు చేసుకుంటుండగా పుష్పావతి కాలుకు పాముకాటు వేసింది. తీవ్ర రక్తస్రావమైన ఆమెను వెంటనే స్థానికంగా నాటు వైద్యం చేయించారు. అయినా, కోలుకోలేక అదే రోజు రాత్రి ఆమె మృతిచెందిందని భర్త ఆంజనేయులు వెల్లడించారు.
Advertisement
Advertisement