మహానేతకు ఘన నివాళి
మహానేతకు ఘన నివాళి
Published Sun, Sep 3 2017 12:51 AM | Last Updated on Sat, Jul 7 2018 3:22 PM
వాడవాడలా వర్ధంతి కార్యక్రమాలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు ః
మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా జిల్లా ప్రజలు ఆ మహనీయుని సేవలు గుర్తు తెచ్చుకుని ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు, గ్రామాల్లో వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. ఏలూరు నగరంలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్థంతి కార్యక్రమం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆళ్ల నాని ఆధ్వర్యంలో నిర్వహించారు. తొలుత వైఎస్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యకర్తలు రక్తదానం చేశారు. నరసాపురంలో మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో దివంగత వైఎస్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ముదునూరి నివాసం నుంచి మోటార్ సైకిళ్లపై స్టీమర్‌రోడ్డు జంక్షన్‌కు చేరుకుని అక్కడ వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పళ్లు, పాలు పంపిణీ చేశారు. తణుకు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తణుకు పట్టణంతోపాటు తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తణుకు పట్టణంలోని నిర్వహించిన కార్యక్రమాల్లో నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌ఛార్జి వంక రవీంద్రనా«ద్ పాల్గొన్నారు. చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలం అయ్యపరాజుగూడెం, భోగోలు గ్రామాల్లో వైఎస్ వర్ధంతి కార్యక్రమానికి ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త కోటగిరి శ్రీధర్, చింతలపూడి నియోజకవర్గ సమన్వయ కర్త దెయ్యాల నవీన్‌బాబు పాల్గొని వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పేదలకు దస్తులు పంపిణీ చేశారు. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. భీమవరం పట్టణంలోని ఆనంద్ ఇన్ ఫంక్షన్‌హాలులో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ముందుగా వైఎస్ చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కన్వీనర్ గ్రంధి శ్రీనివాస్, నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ వంక రవీం«ద్రనా«ద్, ఉండి మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ కన్వీనర్ పాతపాటి సర్రాజు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తాడేపల్లిగూడెంలో మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ కన్వీనర్ కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో పట్టణంలోని పోలీసు ఐలాండ్ వద్ద ఉన్న వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. పేదలకు వస్త్రదానం, అన్నదానం కార్యక్రమాలు చేశారు. కొవ్వూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత కొవ్వూరులోని తన క్యాంపు కార్యాలయంలోను, మొయిన్ రోడ్డులో ఉన్న వైఎస్సాఆర్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళి ఆర్పించారు. çఅనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు, పాలు పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, నాయకులు పరిమి హరిచరణ్ తదితరులు పాల్గొన్నారు. బుట్టాయగూడెంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు నేతృత్వంలో వైఎస్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఉండి నియోజకవర్గంలో నియోజకవర్గ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం జరిగింది. రాజన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం ప్రజలకు పండ్లు పంపిణీ చేసారు. పాలకొల్లులో సమన్వయకర్త గుణ్ణం నాగబాబు ఆధ్వర్యంలో పాలకొల్లు గాంధీబొమ్మల సెంటర్‌లో వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం 200మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకా శేషుబాబు ఆధ్వర్యంలో స్థానిక గాంధీబొమ్మల సెంటర్‌లో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. గోపాలపురం నియోజకవర్గంలో సమన్వయకర్త తలారి వెంకట్రావు వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గోపాలపురంలో పిహెచ్‌సీలో రోగులకు పండ్లు, రొట్టెలను పంపిణీ చేసారు. నిడదవోలు నియోజకవర్గంలో వైసీపీ కన్వీనర్ రాజీవ్ కృష్ణ నేతృత్వంలో కార్యక్రమాలు జరిగాయి. ఉంగుటూరులో నియోజకవర్గ కన్వీనర్ పుప్పాల వాసుబాబు నేతృత్వంలో వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. పెనుగొండలో ఆచంట నియోజకవర్గ సమన్వయకర్త కవురు శ్రీనివాసు ఆధ్వర్యంలో జరిగిన వైఎస్‌ఆర్ వర్ధంతి వేడుకలలో వృద్ధులకు బట్టలు పంపిణీ చేశారు జంగారెడ్డిగూడెం పట్టణంలో గంగానమ్మ గుడి వద్ద ఉన్న వైఎస్ కాంస్య విగ్రహానికి ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త కోటగిరి శ్రీధర్ పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పోల్నాటి బాబ్జి, జిల్లా మహిళా అధ్యక్షురాలు వందనపు సాయిబాల పద్మ పాల్గొన్నారు. దెందులూరు నియోజకవర్గ కన్వీనర్ కొఠారు రామచంద్రరావు అలుగులగూడెం, దెందులూరు, కొమిరేపల్లి గ్రామాల్లో వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దెందులూరు వైద్యశాలలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
Advertisement
Advertisement