అనంతపురం : ప్రత్యేక హోదా కోరుతూ కలెక్టరేట్‌ల వద్ద ధర్నాలకు వైఎస్‌ఆర్‌సీపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో మంగళవారం అనంతపురం కలెక్టరేట్ వద్ద ఆ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, శంకరనారాయణ, గుర్నాథ్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, తిప్పస్వామి, రాంరెడ్డి, మోహన్‌రెడ్డిలతోపాటు వందలాది మంది కార్యకర్తలు ఆందోళనలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాను కేంద్ర వెంటనే ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. హోదాపై తెలుగు ప్రజలను అధికార టీడీపీ వంచిస్తోందని వారు ఆరోపించారు.