బార్క్ అందిస్తున్న కోర్సుల వివరాలు.. | Courses Offered for Bhabha Atomic Research Centre | Sakshi
Sakshi News home page

బార్క్ అందిస్తున్న కోర్సుల వివరాలు..

Published Thu, Nov 21 2013 2:15 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

Courses Offered for Bhabha Atomic Research Centre

 టి. మురళీధరన్
 టి.ఎం.ఐ. నెట్‌వర్క్
 
 మీడియా మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏను ఆఫర్ చేస్తున్న సంస్థలేవి?
 - సుధీర్, నిజామాబాద్.
 ఒక నిర్దిష్ట అవసరానికి సరిపోయే మీడియాను ఎంపిక చేసేందుకు మీడియా మేనేజ్‌మెంట్ అవసరముంటుంది. ఎలాంటి సమాచారం చేరవేయాలి? ఎవరికి చేరవేయాలి? తదితర అంశాల ఆధారంగా తగిన మీడియాను ఎంపిక చేస్తారు. ఇలాంటి వాటికోసం అవసరమైన టూల్స్, టెక్నిక్స్ గురించి మీడియా మేనేజ్‌మెంట్ వివరిస్తుంది.
 
 కోర్సుల వివరాలు:
 అమిటీ స్కూల్ ఆఫ్ కమ్యూనికేషన్, అమిటీ యూనివర్సిటీ, నోయిడా.. మీడియా మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ కోర్సును ఆఫర్ చేస్తోంది. 50 శాతం మార్కులతో ఏ గ్రూపులోనైనా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారు అర్హులు. ఎంట్రన్స్‌లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
 వెబ్‌సైట్: www.amity.edu
 ఎడ్యుకేషనల్ మల్టిమీడియా రీసెర్చ్ సెంటర్, దేవీ అహల్య విశ్వవిద్యాలయ, ఇండోర్.. మీడియా మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏను అందిస్తోంది. ఉమ్మడి రాత పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నారు.
 వెబ్‌సైట్: www.emrcdavv.edu.in
 హిందుస్థాన్ యూనివర్సిటీ, చెన్నై.. మీడియా మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏను ఆఫర్ చేస్తోంది. ఆప్టిట్యూడ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూల ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.
 వెబ్‌సైట్: www.hindustanuniv.ac.in
 సింబయోసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మీడియా అండ్ కమ్యూనికేషన్, పుణే.. ఎంబీఏ- మీడియా మేనేజ్‌మెంట్‌ను అందిస్తోంది.
 కెరీర్: మీడియా సంబంధిత సంస్థలకు మార్కెట్ అధ్యయనం, బిజినెస్ డెవలప్‌మెంట్, సంస్థ ఆర్థిక వ్యవహారాల సమర్థ నిర్వహణ వంటివి కీలకం. ఈ నైపుణ్యాలు ఎంబీఏ (మీడియా మేనేజ్‌మెంట్) ద్వారా పొందొచ్చు. ఈ కోర్సు పూర్తిచేసిన వారికి మీడియా, అడ్వర్టైజింగ్ సంస్థలు; మార్కెట్ రీసెర్చ్ కంపెనీలు, మార్కెటింగ్ సంస్థలు, పబ్లిక్ రిలేషన్ విభాగాలు తదితరాల్లో అవకాశాలు లభిస్తాయి.
 


 సైబర్ సెక్యూరిటీలో కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయి?
 - పూజిత, మహబూబ్‌నగర్.
 ఇప్పుడు అన్ని రంగాలకూ ఐటీ సేవల అవసరం బాగా పెరిగింది. సంస్థల కార్యకలాపాల్లో కంప్యూటర్లు- ఇంటర్నెట్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం అధికమైంది. ఈ నేపథ్యంలో ఐటీ వ్యవస్థలపై సైబర్ దాడులు జరక్కుండా ఇన్ఫర్మేషన్/ సైబర్ సెక్యూరిటీ రక్షణ కల్పిస్తోంది.
 
 కోర్సుల వివరాలు:
 జేఎన్‌టీయూ, హైదరాబాద్.. కంప్యూటర్ నెట్‌వర్క్స్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో ఎంటెక్‌ను అందిస్తోంది. ఎంట్రన్స్ టెస్ట్/గేట్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తోంది.
 వెబ్‌సైట్: www.jntuh.ac.in
 ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్ నెట్‌వర్క్స్‌లో ఎంటెక్‌ను ఆఫర్ చేస్తోంది.
 వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in
 ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హైదరాబాద్.. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో ఎంటెక్‌ను ఆఫర్ చేస్తోంది.
 వెబ్‌సైట్: iiit.net
 ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ, సెంటర్ ఫర్ డిస్టెన్స్ లెర్నింగ్, ఘజియాబాద్.. ఏడాది కాల వ్యవధితో సైబర్ సెక్యూరిటీలో పీజీ డిప్లొమాను అందిస్తోంది.
 వెబ్‌సైట్: www.imtcdl.ac.in
 అవకాశాలు: కంప్యూటర్ నెట్‌వర్క్స్‌తో పనిచేస్తున్న అన్ని సంస్థలకూ సైబర్ సెక్యూరిటీ నిపుణుల అవసరం ఉంటుంది. ఐటీ కంపెనీలు ప్రత్యేకంగా సైబర్ సెక్యూరిటీ నిపుణులను నియమించుకుంటున్నాయి. ఇన్ఫర్మేషన్/ సైబర్ సెక్యూరిటీ కోర్సులు పూర్తిచేసిన వారికి డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్, సెక్యూరిటీ అనలిస్ట్, నెట్‌వర్క్ ఇంజనీర్ వంటి ఉద్యోగాలుంటాయి.
 
 బయోటెక్నాలజీలో ఎంటెక్‌ను అందిస్తున్న ఐఐటీల వివరాలు తెలపండి?
 - ప్రవీణ్, శ్రీకాకుళం.
 ఇంజనీరింగ్ సూత్రాలను జీవ కణాల లక్షణాలు, ప్రవర్తనలకు అనువర్తింపజేసేదే బయోటెక్నాలజీ. నేడు బయోటెక్నాలజీ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. బయో ఫెర్టిలైజర్స్, బయో పెస్టిసైడ్స్, బయో ఫ్యూయల్స్, బయో ఫార్మాస్యూటికల్స్, హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్, బయో కాస్మోటిక్స్, జన్యు మార్పిడి పంటలు.. ఇవన్నీ బయోటెక్నాలజీ పరిశోధనల ఫలితాలే.
 ఐఐటీ ఖరగ్‌పూర్.. బయోటెక్నాలజీ అండ్ బయో కెమికల్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్‌ను ఆఫర్ చేస్తోంది. అర్హత: సంబంధిత సబ్జెక్టులో బీఈ/బీటెక్ లేదా ఎంఎస్సీ. గేట్‌లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
 వెబ్‌సైట్: www.iitkgp.ac.in
 ఐఐటీ, గౌహతి..
 బయోటెక్నాలజీలో ఎంటెక్‌ను ఆఫర్ చేస్తోంది.
 వెబ్‌సైట్: www.iitg.ac.in
 ఐఐటీ, హైదరాబాద్.. మెడికల్ బయోటెక్నాలజీలో ఎంటెక్‌ను అందిస్తోంది. అర్హత: లైఫ్ సెన్సైస్ బ్రాంచ్‌లో బీఈ/బీటెక్ లేదా ఎంఎస్సీ.
 వెబ్‌సైట్: http://biotech.iith.ac.in
 జేఎన్‌టీయూ, హైదరాబాద్.. బయోటెక్నాలజీలో ఎంటెక్‌ను ఆఫర్ చేస్తోంది. ఎంట్రెన్స్/గేట్‌లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
 వెబ్‌సైట్: www.jntuh.ac.in
 అవకాశాలు: బయోటెక్నాలజీ కోర్సులు పూర్తిచేసిన వారికి డ్రగ్ డెవలప్‌మెంట్, హెల్త్‌కేర్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫిషరీస్, కెమికల్స్, బయో ప్రొడక్ట్స్, టెక్స్‌టైల్స్, వేస్ట్ మేనేజ్‌మెంట్, అగ్రికల్చరల్, ప్రభుత్వ విభాగాలు, పరిశోధన సంస్థలు, విద్యా సంస్థల్లో అవకాశాలుంటాయి.
 
 బార్క్ అందిస్తున్న కోర్సుల వివరాలు తెలపగలరు?
 - చరణ్, గద్వాల్.
బాబా ఆటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్), ముంబై.. రేడియేషన్ భద్రతకు సంబంధించిన కోర్సులను అందిస్తోంది. బార్క్ రేడియాలజికల్ ఫిజిక్స్‌లో ఏడాది కాల వ్యవధితో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాను ఆఫర్ చేస్తోంది.
 అర్హత: ఎంఎస్సీ- ఫిజిక్స్.
 ఈ కోర్సు పూర్తిచేసిన వారు ఆర్‌ఎస్‌వో లెవెల్-3 సర్టిఫికేషన్‌కు అర్హత సాధిస్తారు.
 వెబ్‌సైట్: http://barc.ernet.in

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement