ఎన్. ధ్రుపతి కుమార్
గ్రహాల పరిమాణంలో భూమి స్థానం?
భౌతిక భూగోళ శాస్త్రం
ఎన్. ధ్రుపతి కుమార్
గెజిటెడ్ హెడ్ మాస్టర్,
నిజామాబాద్ జిల్లా
సౌరకుటుంబం, భూమి - చలనాలు - ఫలితాలు, భూ అంతర్భాగం, అక్షాంశాలు, రేఖాంశాలు, గ్రహణాలు
1. కొన్నికోట్ల నక్షత్రాల సముదాయాన్ని ఏ విధంగా పిలుస్తారు?
పాలవెల్లి/ ఆకాశగంగ/ పాలపుంత
2. భూమికి అతి దగ్గరలో ఉన్న నక్షత్రం?
సూర్యుడు
3. సూర్యుని ఉపరితలంపై ఉష్ణోగ్రత?
6000ౌఇ
4. భూగోళంపై మొత్తం ఎన్ని రేఖాంశాలు ఉన్నాయి?
360
5. సూర్యునికి అతి దగ్గరగా ఉన్న నక్షత్రం?
బుధుడు
6. భూమి నుంచి సూర్యుని దూరం సుమారు?
149.4 మి.కి.మీ.
7. సూర్యకాంతి భూమిని చేరడానికి పట్టే సమయం?
8 నిమిషాలు
8. సూర్యుని నుంచి దూరంలో భూమి ఎన్నో స్థానంలో ఉంది?
మూడో
9. ఉపగ్రహాలు లేని గ్రహాలు?
బుధుడు, శుక్రుడు
10. భూమి ఏకైక ఉపగ్రహం?
చంద్రుడు
11. భూమికి, చంద్రునికి మధ్యదూరం సుమారు?
3,84,365 కి.మీ.
12. వేటిని అంతర గ్రహాలు అంటారు?
బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు
13. బాహ్యగ్రహాలు ఏవి?
బృహస్పతి, శని, వరుణుడు (యురేనస్), ఇంద్రుడు (నెఫ్ట్యూన్)
14. గ్రహాల పరిమాణంలో మొదటి రెండు స్థానాలు ఆక్రమించేవి?
బృహస్పతి, శని
15. {Vహాల పరిమాణంలో భూమి స్థానం?
ఐదు
16. సౌరకుటుంబం పుట్టుకకు సంబంధించిన ‘గ్రహకాల పరికల్పన’ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు?
ఛాంబర్లీన్ - మౌల్టన్
17. భూమి తన అక్షంపై తనచుట్టూ తాను తిరగడాన్ని ఏమంటారు?
భూభ్రమణం
18. భూభ్రమణం వేగం గంటకు?
1610 కి.మీ
19. భూభ్రమణం దిశ?
పశ్చిమం నుంచి తూర్పునకు
20. భూమి తనచుట్టూ తాను తిరిగేటప్పుడు ఉత్తరాన, దక్షిణాన స్థిరంగా ఉండే బిందువులను ఏమంటారు?
{ధువాలు
21. ఉత్తర, దక్షిణ ధ్రువాలను కలుపుతూ భూ నాభి ద్వారా గీసిన ఊహారేఖను ఏమంటారు?
అక్షం
22. భూభ్రమణం వల్ల సంభవించే ప్రధాన ఫలితం?
పగలు, రాత్రి ఏర్పడటం
23. భూమి ఒకసారి తనచుట్టూ తాను తిరగడానికి పట్టే సమయం?
23 గంటల 56 నిమిషాల 4.09 సెకన్లు
24. పవనాల మార్గాలు, సముద్ర ప్రవాహాల మార్గాల్లో మార్పులు సంభవించడానికి ప్రధాన కారణం?
భూభ్రమణం
25. భూమి తన అక్షంపై తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని ఏమంటారు?
భూపరిభ్రమణం
26. భూమి సూర్యుని చుట్టూ తిరిగే నిర్ణీత మార్గాన్ని ఏమంటారు?
కక్ష్య
27. భూమి కక్ష్య ఏ ఆకారంలో ఉంటుంది?
దీర్ఘ వృత్తాకారం
28. భూమి కక్ష్య పొడవు ఎంత?
965 మి.కి.మీ.
29. భూ పరిభ్రమణానికి పట్టే సమయం?
365 1/4 రోజులు
30. సాధారణ సంవత్సరంలో 365 రోజులు పోనూ మిగిలిన 1/4 (6 గంటలు) రోజును ఏ విధంగా లెక్కిస్తారు?
నాలుగేళ్లకు ఒకసారి ఒక రోజును ఎక్కువగా లెక్కిస్తారు
31. 366 రోజులు ఉండే సంవత్సరాన్ని ఏమంటారు?
లీపు సంవత్సరం
32. లీపు సంవత్సరంలో ఏ నెలలో రోజుల సంఖ్య పెరుగుతుంది?
ఫిబ్రవరి
33. భూ పరిభ్రమణం వల్ల ఏర్పడే ఫలితాలు?
పగలు, రాత్రివేళల్లో... తేడాలు, రుతువులు ఏర్పడటం
34. భూమికి, సూర్యునికి అత్యధిక దూరం (152 మి.కి.మీ.) ఉండే స్థితి, తేది?
అపహేళి, జులై 4
35. భూమికి, సూర్యునికి అత్యల్ప దూరం
(147 మి.కి.మీ.) ఉండే స్థితి, తేది?
పరిహేళి, జనవరి 3
36. భూమధ్య రేఖపై సూర్య కిరణాలు లంబంగా ఎప్పుడు పడతాయి?
మార్చి 21, సెప్టెంబర్ 23
37. విషవత్తులు అంటే?
{పపంచమంతా పగలు, రాత్రి సమానంగా ఉండే రోజులు. అవి మార్చి 21, సెప్టెంబర్ 23
38. జూన్ 21న సూర్య కిరణాలు ఎక్కడ లంబంగా పడతాయి?
కర్కటరేఖ
39. మకరరేఖపై సూర్య కిరణాలు లంబంగా పడే రోజు?
డిసెంబర్ 22
40. భూమి ఉపరితలం నుంచి నాభివరకు దూరం (వ్యాసార్ధం) ఎంత?
6,440 కి.మీ.
41. మానవుడు నేటి వరకూ భూమి అంతర్భాగంలోకి తవ్వకాల ద్వారా సుమారు ఎంత లోతు వరకు చేరుకోగలిగాడు?
3 కి.మీ.
42. చమురు తవ్వకాల కోసం గొట్టాలను సుమారు ఎంత లోతువరకు పంపగలిగారు?
6 1/2కి.మీ
43. శాస్త్రవేత్తలు వేటి ఆధారంగా భూ అంతర నిర్మాణం గురించి తెలుసుకున్నారు?
భూకంప తరంగాలు
44. ఉపరితలం నుంచి భూమి లోపలికి పోయే కొద్దీ ఉష్ణోగ్రత పెరుగుతుందా? తగ్గుతుందా? ఎంత?
పెరుగుతుంది, ప్రతి 32 మీ.కు 1ౌఇ
45. భూనాభి వద్ద ఉండే ఉష్ణోగ్రత సుమారు?
6000ౌఇ
46. భూ నాభివద్ద శిలాద్రవం ద్రవ రూపంలో కాకుండా మెత్తని ముద్దలా ఉండడంతో పాటు ఘన పదార్థాల లక్షణం కూడా ఉండడానికి కారణం?
పీడన బలం అధికంగా ఉండటం
47. భూపటలం మందం ఎంత?
60కి.మీ
48. భూప్రావారం మందం ఎంత?
2840కి.మీ
49. భూకేంద్ర మండలం మందం ఎంత?
3500కి.మీ
50. సిలికా, అల్యూమినియం, ఆక్సిజన్, మెగ్నీషియం మొదలైన వాటి మిశ్రమంతో కూడిన భూమి అంతర్భాగం?
భూపటలం
51. నికెల్, ఇనుముల రసాయన సమ్మేళనం కలిగిన భూ అంతర్భాగం?
భూకేంద్ర మండలం
52. భూమి అంతర్భాగంలో మూడు పొరలు ఉన్నాయని పేర్కొన్నవారు?
సుయెస్
53. సుయెస్ అభిప్రాయంలో సిలికా, అల్యూమినియంల మిశ్రమం ప్రధానంగా కలిగిన పొర?
సియాల్
54. సుయెస్ అభిప్రాయంలో ‘సిమా’ అంటే?
సిలికా, మెగ్నీషియం మూలకాల మిశ్రమం కలిగిన పొర
55. సుయెస్ అభిప్రాయంలో నికెల్, ఇనుము ఖనిజాల మిశ్రమంలో మాత్రమే ఏర్పడిన పొర?
నిఫె