ఆతిథ్యం’ కోర్సులకు ఆహ్వానం | World Travel and Tourism Council | Sakshi
Sakshi News home page

ఆతిథ్యం’ కోర్సులకు ఆహ్వానం

Published Thu, Jan 8 2015 4:02 AM | Last Updated on Sat, Sep 2 2017 7:21 PM

ఆతిథ్యం’ కోర్సులకు ఆహ్వానం

ఆతిథ్యం’ కోర్సులకు ఆహ్వానం

 దేశంలో పర్యాటక రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ‘వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్’ అంచనాల ప్రకారం 2013-23 మధ్య పర్యాటక రంగంలో వార్షిక సరాసరి వృద్ధిరేటు 7.9గా ఉండనుంది. ఈ క్రమంలోనే ఆతిథ్య (హాస్పిటాలిటీ) పరిశ్రమ యువతకు అపార ఉద్యోగావకాశాలు అందిస్తోంది. వీటిని అందుకునేందుకు బాటలు వేసే  ఎన్‌సీహెచ్‌ఎం- జేఈఈ 2015 నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో కోర్సులు, అర్హతలు, కెరీర్ అవకాశాలపై ఫోకస్..
 
 నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ (ఎన్‌సీహెచ్‌ఎంసీటీ).. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయంప్రతిపత్తి గల సంస్థ. ఇది దేశ వ్యాప్తంగా వివిధ సంస్థలు అందిస్తున్న బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్‌తో పాటు మరో తొమ్మిది ఇతర కోర్సుల నిర్వహణను నియంత్రిస్తోంది. దీని గుర్తింపు ఉన్న విద్యా సంస్థలు ఆతిథ్యం, అనుబంధ రంగాలకు అవసరమైన వృత్తి నిపుణులను అందిస్తున్నాయి.
 
 ఎన్‌సీహెచ్‌ఎం-జేఈఈ:
 ఎన్‌సీహెచ్‌ఎం-జేఈఈ పరీక్ష ద్వారా బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులో ప్రవేశించవచ్చు. ఇందుకోసం దేశ వ్యాప్తంగా 51 సంస్థల్లో 7,482 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మూడేళ్ల కాలవ్యవధి గల ఈ కోర్సులో ఆరు సెమిస్టర్లు ఉంటాయి. దీని ద్వారా సూపర్‌వైజరీ, ఫుడ్ ప్రొడక్షన్, ఫుడ్ అండ్ బేవరేజ్ సర్వీస్, హోటల్ అకౌంటెన్సీ, ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, టూరిజం మార్కెటింగ్ అండ్ మేనేజ్‌మెంట్ విభాగాలకు అవసరమైన నైపుణ్యాలు సమకూరుతాయి.
 
 అర్హత:
 ఇంగ్లిష్ ఒక సబ్జెక్ట్‌గా 10+2 లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
  వయసు:జనరల్, ఓబీసీ అభ్యర్థులు 1993, జూలై 1న లేదా ఆ తర్వాత, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 1990, జూలై 1న లేదా  ఆ తర్వాత జన్మించి ఉండాలి. ఎంపిక: ఆలిండియా ర్యాంకుల ఆధారంగా.
 
 పరీక్ష విధానం:
 సబ్జెక్టు పశ్నలు
 1. న్యూమరికల్ ఎబిలిటీ, అనలిటికల్ ఆప్టిట్యూడ్    30
 2. రీజనింగ్ అండ్ లాజికల్ డిడక్షన్    30
 3. జీకే అండ్ కరెంట్ అఫైర్స్    30
 4. ఇంగ్లిష్ లాంగ్వేజ్    60
 5. సర్వీస్ సెక్టార్ ఆప్టిట్యూడ్    50
 ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమంలో ఉంటుంది. 200 ప్రశ్నలకు 3 గంటల్లో సమాధానాలు గుర్తించాలి.
 1 నుంచి 4 విభాగాల్లో ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు. తప్పు సమాధానానికి 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఐదో విభాగంలోని ప్రశ్నలకు చాలా దగ్గరి సమాధానానికి 1 మార్కు, ఆ తర్వాతి దగ్గరి సమాధానానికి 0.75 మార్కు, దీని తర్వాతి దగ్గరి సమాధానానికి 0.50 మార్కు ఉంటుంది. చివరి ఆప్షన్‌కు 0.25 మార్కు కోత విధిస్తారు. సర్వీస్ సెక్టార్ ఆప్టిట్యూడ్: మిగిలిన విభాగాలతో పోల్చితే ఇది కొత్త విభాగం. సేవా రంగంలో పనిచేసేందుకు అవసరమైన ఇంటర్‌పర్సనల్ నైపుణ్యాలు అభ్యర్థుల్లో ఉన్నాయా..లేదా అనేది తెలుసుకునేలా ఈ విభాగం ప్రశ్నలు ఉంటాయి.
 
 ముఖ్య సమాచారం:
 ఆఫ్‌లైన్‌లో దరఖాస్తుకు చివరి తేదీ:  ఏప్రిల్ 6, 2015.
 రాత పరీక్ష: ఏప్రిల్ 25, 2015.
 ఫలితాల వెల్లడి: మే రెండో వారం, 2015.
 వెబ్‌సైట్: applyadmission.net/nchmjee2015
 
 అవకాశాలు అపారం!
  పర్యాటకుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండడం.. మెడికల్, ఎడ్యుకేషనల్, బిజినెస్, అగ్రికల్చర్ తదితర విభాగాల్లో టూరిజం అభివృద్ధి చెందుతుండటంతో హోటల్‌మేనేజ్‌మెంట్ రంగంలో గణనీయమైన వృద్ధి చోటుచేసుకుంటోంది. యువతకు అపార ఉద్యోగావకాశాలను అందిస్తోంది. ఆతిథ్య కోర్సులు అభ్యసించిన వారు కేవలం హోటళ్లకే పరిమితం కావడం లేదు. బ్యాంకింగ్, బీపీఎల్ తదితర విభిన్న సేవారంగాల్లో కొలువులు సొంతం చేసుకుంటున్నారు. భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్‌మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ (నోయిడా) నిర్వహించే జేఈఈకి ఏటా సుమారు 20వేల మంది పోటీపడుతున్నారు. దీనిద్వారా దేశంలోని కేంద్ర, రాష్ట్ర స్థాయి ఇన్‌స్టిట్యూట్‌లతోపాటు ప్రముఖ ప్రైవేటు హోటల్‌మేనేజ్‌మెంట్ కళాశాలల్లో అందుబాటులో ఉన్న 7 వేలకు పైగా బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ సీట్లను భర్తీ చేస్తారు. పదోతరగతి, ఇంటర్మీడియెట్ స్థాయిలోని సైన్స్, జనరల్ నాలెడ్జ్, ఇంగ్లిష్ సబ్జెక్టులను ప్రిపేరైతే పరీక్షలో విజయం సాధించవచ్చు. ఈ కోర్సులు పూర్తిచేసిన వారికి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో మంచి ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ఉన్నతవిద్య దిశగా వెళ్లాలనుకునే వారు ఎంబీఏ టూరిజం, ఎంబీఏ హాస్పిటాలిటీ చేసి విదేశాల్లోనూ అవకాశాలు సొంతం చేసుకోవచ్చు.
 - ఎస్.సుధాకుమార్, హెచ్‌ఓడీ (ఫుడ్ ప్రొడక్షన్),
 ఐహెచ్‌ఎంసీటీ అండ్ ఏఎన్, హైదరాబాద్.
 
 కెరీర్ అవకాశాలు:
 ప్రస్తుతం దేశంలో పర్యాటక రంగం అభివృద్ధి పథంలో పయనిస్తోంది. భారత ఆర్థిక సర్వే ప్రకారం 2012-13లో దేశానికి 65.80 లక్షల మంది విదేశీ పర్యాటకులు వచ్చారు. ఇది 2013-14 నాటికి 69.70 లక్షలకు చేరింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో వస్తున్నాయి. దీంతో యువతకు ఉపాధి అవకాశాలు పెరిగాయి.

 గ్రాడ్యుయేట్లు-అవకాశాలు:
 హాస్పిటాలిటీ, హోటల్ అడ్మినిస్ట్రేషన్ గ్రాడ్యుయేట్లకు
 ఆతిథ్య రంగంలో వివిధ విభాగాల్లో అవకాశాలుంటాయి. అవి..
 హోటల్ పరిశ్రమలో మేనేజ్‌మెంట్ ట్రైనీ.
 ఇండియన్ నేవీ హాస్పిటాలిటీ సర్వీసెస్‌లో ఉద్యోగాలు.
 హోటల్, ఇతర సేవా రంగాల్లో గెస్ట్/కస్టమర్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్.
 జాతీయ, అంతర్జాతీయ ఫాస్ట్‌ఫుడ్ చెయిన్లలో మేనేజ్‌మెంట్ ట్రైనీ/ఎగ్జిక్యూటివ్.
 స్పిటల్ అండ్ ఇన్‌స్టిట్యూషనల్ కేటరింగ్.
 హోటల్, ఇతర సేవారంగాల్లో మార్కెటింగ్/ సేల్స్ ఎగ్జిక్యూటివ్.
 రాష్ట్ర స్థాయి పర్యాటక అభివృద్ధి సంస్థలు.
 సొంత సంస్థల ఏర్పాటు ద్వారా స్వయం ఉపాధి పొందవచ్చు.

 వేతనాలు:
 మేనేజ్‌మెంట్ ట్రైనీగా అరుుతే నెలకు రూ.15 నుంచి రూ.18 వేలు, ట్రైనీ సూపర్‌వైజర్‌కైతే
 రూ. 10 నుంచి రూ. 14 వేలు, మిగతా విభాగాల వారికి రూ. 10 వేలు వర కూ వేతనం
 లభిస్తుంది. తర్వాత అనుభవం, ప్రతిభ ఆధారంగా రూ.30,000 నుంచి రూ.లక్ష వరకు సంపాదించవచ్చు.
 
 క్లాట్-2015
 అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ లా కోర్సుల్లో (ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం) ప్రవేశానికి ఏటా జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్ష కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్). ఇందులో సాధించిన ర్యాంకు ద్వారా 16 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లోని లా కోర్సుల్లో ప్రవేశించవచ్చు. క్లాట్-2015కు ప్రకటన వెలువడిన నేపథ్యంలో అర్హతలు, పరీక్ష విధానం వివరాలు..క్లాట్-2015ను లక్నోలోని డాక్టర్ రాంమనోహర్ లోహి యా నేషనల్ లా యూనివర్సిటీ నిర్వహించనుంది.
 
 అర్హత:
 యూజీ కోర్సులకు: జనరల్/ఓబీసీ/శారీరక వికలాంగు లు 45 శాతం (ఎస్సీ/ఎస్టీలకు 40 శాతం) మార్కులతో 10+2 ఉత్తీర్ణత. 2015 మార్చి/ఏప్రిల్‌లో ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాసేవారు అర్హులే.
 వయోపరిమితి: జూలై 1, 2015 నాటికి జనరల్/ఓబీసీలకు 20 ఏళ్లు (ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 22 ఏళ్లు).
 పీజీ కోర్సులకు: ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 50 శాతం, ఇతరులు 55 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ లేదా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
 
 యూజీ కోర్సులకు పరీక్ష విధానం:
 సబ్జెక్టు    మార్కులు
 ఇంగ్లిష్ ఇన్‌క్లూడింగ్ కాంప్రెహెన్షన్    40
 జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్    50
 ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్
 (న్యూమరికల్ ఎబిలిటీ)    20
 లీగల్ ఆప్టిట్యూడ్    50
 లాజికల్ రీజనింగ్    40
 ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 200 ప్రశ్నలకు రెండు గంటల్లో సమాధానాలు గుర్తించాలి. ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు కోత విధిస్తారు.

 పీజీ కోర్సులకు పరీక్ష విధానం:
 కాన్‌స్టిట్యూషనల్ లా, జ్యురిస్‌ప్రుడెన్స్‌ల నుంచి 50 చొప్పున ప్రశ్నలు ఇస్తారు. కాంట్రాక్ట్, టార్ట్స్, క్రిమినల్ లా, ఇంటర్నేషనల్ లా, ఫ్యామిలీ లా, ప్రాపర్టీ లా, ఐపీఆర్ తదితర సబ్జెక్టుల నుంచి 50 ప్రశ్నలు ఇస్తారు.  సరైన సమాధానానికి 1 మార్కు. తప్పు సమాధానానికి 0.25 మార్కు కోత ఉంటుంది.
 
 ముఖ్య సమాచారం:
 ఆన్‌లైన్ దరఖాస్తు:
 జనవరి 1, 2015-మార్చి 31, 2015.
 ఆన్‌లైన్ పరీక్ష: మే 10, 2015.
 పరీక్ష ఫీజు: అన్‌రిజర్వ్‌డ్, ఓబీసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.4 వేలు; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.3,500. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో చెల్లించవచ్చు.
  వెబ్‌సైట్: http://clat.ac.in
 
         క్లాట్‌తో ప్రవేశాలు కల్పించే సంస్థలు
     నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ- బెంగళూరు.
     నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీ అండ్ రీసెర్చ్ (నల్సార్) యూనివర్సిటీ ఆఫ్ లా- హైదరాబాద్.
     నేషనల్ లా ఇన్‌స్టిట్యూట్ యూనివర్సిటీ, భోపాల్.
     వెస్ట్ బెంగాల్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జ్యురిడికల్ సెన్సైస్, కోల్‌కతా.
     నేషనల్ లా యూనివర్సిటీ, జోధ్‌పూర్.
     హిదయతుల్లా నేషనల్ లా యూనివర్సిటీ, రాయ్‌పూర్.
     గుజరాత్ నేషనల్ లా యూనివర్సిటీ, గాంధీనగర్.
     డాక్టర్ రాంమనోహర్ లోహియా నేషనల్ లా యూనివర్సిటీ, లక్నో.
     రాజీవ్‌గాంధీ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లా, పంజాబ్.
     చాణక్య నేషనల్ లా యూనివర్సిటీ, పాట్నా.
     నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ అడ్వాన్స్డ్ లీగల్ స్టడీస్, కోచి.
     నేషనల్ లా యూనివర్సిటీ, కటక్.
     నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ స్టడీ అండ్ రీసెర్చ్ ఇన్ లా, రాంచీ.
     నేషనల్ లా యూనివర్సిటీ అండ్ జ్యుడీషియల్ అకాడమీ, గువహటి.
     దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ, విశాఖపట్నం.
     తమిళనాడు నేషనల్ లా స్కూల్, తిరుచిరాపల్లి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement