తొలివిడత ‘స్థానిక’ సమరానికి ప్రచార ఘట్టం మరికొన్ని గంటల్లో ముగియనుండడంతో గురువారం అన్ని రాజకీయ పక్షాలూ దూకుడు పెంచాయి. పల్లెల్లో సూర్యోదయంతో పాటు వివిధ పార్టీల వాహనాలు ప్రత్యక్షమయ్యాయి.
ఆయా పార్టీలకు అనుగుణంగా పాటలతో ఊళ్లు హోరెత్తి పోయాయి. పోటీలో ఉన్న అభ్యర్థుల తరపున వారు మద్దతు దారులు ఇంటింటికీ తిరిగి ఓటును అర్థించారు. తారసపడిన పెద్దల కాళ్లకు మొక్కి ఎన్నికల భక్తిని చాటుకున్నారు. మహిళలకు బొట్టుపెట్టి తమకు అండగా నిలవాలని కోరారు.