మోతడక (తాడికొండ), న్యూస్‌లైన్: మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ గల్లంతువుతోంది. అత్యధికంగా ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు వైఎస్సార్ సీపీలో చేరుతున్నారు. ఇందులో భాగంగా గురువారం మోతడక గ్రామంలో తాడికొండ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త కత్తెర సురేష్‌కుమార్, జెడ్పీటీసీ అభ్యర్థి ఆళ్ల శ్రీనివాసరెడ్డి, మండల కన్వీనర్ నిమ్మగడ్డ రవి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు.
మోతడకలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన వైఎస్సార్ సీపీ నేతల సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నిమ్మగడ్డ ప్రసాదు, చుక్కపల్లి పిచ్చయ్య, వీరయ్య, వాడకొప్పుల రాజు తదితరులు ఆద్వర్యంలో 90మంది పైగా కార్యకర్తలు వైఎస్సార్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా సురేష్‌కుమార్ మాట్లాడుతూ జననేత జగనన్న ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యమన్నారు.
రైతులతో పాటు రైతుకూలీల సంక్షేమానికి రాజన్న రాజ్యం కోసం జగనన్నను బలపర్చాలన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల్లో పోటీచేసే అభ్యుర్థులతోపాటు, మండల ఎస్సీ విభాగం కన్వీనర్ కొలికిపూడి బుజ్జి, బీసీ విభాగం కన్వీనర్ శివశంకర్, అంబటి నాగేశ్వరరావు, లచ్చన్నగుడిపూడి సర్పంచి బుర్రా వెంకటేశ్వరరెడ్డి, షేక్ జానీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం గరిక పాడు, కంతేరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
వైఎస్సార్ సీపీలోకి కాంగ్రెస్ కార్యకర్తలు
Published Fri, Mar 28 2014 1:59 AM | Last Updated on Fri, Mar 22 2019 6:18 PM
Advertisement
Advertisement