సాక్షి ప్రతినిధి, కడప: తెలుగుదేశం పార్టీ కడప పార్లమెంటు టికెట్ కోసం ఒక పారిశ్రామిక వేత్త, మరో కాంట్రాక్టర్ పోటీ పడుతున్నారు. గతంలో పోటీచేసిన పారిశ్రామిక వేత్త ఈమారు టికెట్ అడుగుతూనే అప్పగిస్తారనే ఆశలో ఉన్నారంట. ఆ పారిశ్రామిక వేత్త నేరుగా చంద్రబాబును కలిసి మనసులో మాట వెల్లడించాడంట. అయితే పార్టీ పర్యవే క్ష బాధ్యతలు చూస్తున్న మరోనేత (చంద్రబాబు కోటరీకి చెందిన వ్యక్తి) ఇప్పుడు వీళ్లకు అంత సీన్‌లేదని చంద్రబాబుతో చెప్పాడంట.. ప్రత్యామ్నాయంగా ఓ కాంట్రాక్టర్‌ను టచ్‌లో పెట్టానని చెప్పాడంట.. మనం టికెట్ ఇస్తే రూ. 15 కోట్లు ఖర్చు పెట్టుకుంటాడు.. నేనే సెట్‌చేశానని చెప్పాడంట.. దాంతో ముందు వెనకా ఆలోచించకుండా కాంట్రాక్టర్ వైపు చంద్రబాబు మొగ్గుచూపుతున్నాడంట.. రాజకీయాల్లోకి రావాలనే ఉబలాటం ఆ కాంట్రాక్టర్‌కు అధికంగా ఉంది.
సొంత అన్ననే పక్కకు తప్పించి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడు. కడప పార్లమెంటుకు ఆ కాంట్రాక్టర్ నాన్‌లోకల్ అవుతాడు కదా.. అని పార్టీ నేతలు కొందరు ప్రశ్నిస్తే పారిశ్రామిక వేత్త కంటే మెరుగే కదా... ఇంకా అభ్యంతరం ఎందుకని పార్టీని పర్యవేక్షించే నేత చెప్పుకొచ్చాడంట.. ‘పూలు అమ్ముకున్న చోట కట్టెలు అమ్ముకోవాల్సిన దుస్థితి’ ఏర్పడిందని పారిశ్రామిక వేత్త అనుచరుల ఎదుట వాపోతున్నాడంట. చంద్రబాబుకు మనమీద మంచి ఉద్దేశం ఉన్నా ఈ చిల్లరోడు పడనీయడం లేదని కారాలు మిరియాలు నూరుతున్నాడంట. గౌరవం ఉన్న చోట ఉందామంటే నామాట.. వింటావా... అని పారిశ్రామిక వేత్తపై ఆయన సోదరుడు ఆగ్రహం వ్యక్తం చేశాడంట.
రూ.15 కోట్లు ఖర్చుచేస్తాడంట!
Published Wed, Apr 2 2014 3:05 AM | Last Updated on Fri, Aug 10 2018 5:38 PM
Advertisement