బాబు వైఖరిపై టీడీపీ నేతల మండిపాటు
సాక్షి, హైదరాబాద్: ‘బీజేపీకి కేటాయించిన స్థానాల్లో ఆ పార్టీ నిలిపిన అభ్యర్థులంతా బలహీనంగా ఉన్నారు.. మీరు నామినేషన్లు వేయండి..’ అని చెప్పి, ఇప్పుడు వాటిని ఉపసంహరించుకోవాలని చెప్పడమేంటని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. నామినేషన్లు వేసి ఎన్నికల ప్రచారానికి సైతం వెళ్లాలని చెప్పి 24 గంటలైనా గడవక ముందే నామినేషన్లు ఉపసంహరించుకోవాల్సింది గా ఆదేశించడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీతో తెగతెంపులు చేసుకున్నందున ఆ పార్టీకి కేటాయించిన నియోజకవర్గాల్లో నామినేషన్లు వేయాలన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు ఆరు అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ నేతలు గురువారం నామినేషన్లు దాఖలు చేశారు. కాగా అటు పార్టీ అభ్యర్థులతో నామినేషన్లు వేరుుంచిన చంద్రబాబు ఇటు హైదరాబాద్‌లో బీజేపీ నేతలతో పొత్తుపై మంతనాలు కొనసాగించారు. చర్చల అనంతరం బీజేపీతో పొత్తు కొనసాగుతుందని ప్రకటించి.. ఆ పార్టీకి కేటారుుంచిన సీట్లలో నామినేషన్లు వేసిన టీడీపీ అభ్యర్థులను వాటిని ఉపసంహరించుకోవాల్సిందిగా చంద్రబాబు ఆదేశించారు.
బీజేపీకి కేటాయించిన స్థానాల్లో వాస్తవానికి తొలి నుంచి పోటీకి సిద్ధంగా ఉన్న టీడీపీ నేతలతోనే నామినేషన్లు వేయించారు. ప్రసాద్ (పాడేరు), కొట్టు సత్యనారాయణ (తాడేపల్లిగూడెం), జయమంగళ వెంకటరమణ (కైకలూరు), గోరంట్ల బుచ్చయ్యచౌదరి (రాజమండ్రి అర్బన్), బీఎన్ విజయ్‌కుమార్ (సంతనూతలపాడు), ఖలీల్ బాషా (కడప) వీరిలో ఉన్నారు. నరసాపురం లోక్‌సభ నుంచి కనుమూరి, రఘురామకృష్ణంరాజు ఇటు టీడీపీ అటు బీజేపీ తరఫునా నామినేషన్లు వేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ, టీడీపీ మధ్య మళ్లీ పొత్తు చ ర్చలు జరిగాయి. అనంతరం టీడీపీ ఎంపీ సుజనా చౌదరి మాట్లాడుతూ బీజేపీకి కేటాయించిన స్థానాల్లో నామినేషన్లు దాఖలు చేసిన టీడీపీ అభ్యర్థులు వాటిని ఉపసంహరించుకుంటారని చెప్పారు. దీంతో నామినేషన్లు దాఖలు చేసిన టీడీపీ నేతలు మండిపడుతున్నారు. హైదరాబాద్ లో కూర్చొని చర్చలు జరపగానే అప్పటివరకు బలహీనంగా ఉన్న బీజేపీ అభ్యర్థులు బలవంతులైపోయూరా? అంటూ ఓ నేత ఆగ్రహంతో ఊగిపోయారు.
మేమేమైనా బలి పశువులమా?
Published Sat, Apr 19 2014 2:04 AM | Last Updated on Fri, Mar 29 2019 9:13 PM
Advertisement
Advertisement