పరిషత్ పోరులో 84.30 శాతం
Published Mon, Apr 7 2014 2:50 AM | Last Updated on Sat, Sep 2 2017 5:40 AM
సాక్షి, ఏలూరు : ఎండలు మండుతున్నా.. బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ వల్ల ఇబ్బందులు తలెత్తినా ఓటర్లు తమ ఓటు హక్కును బాధ్యతతో వినియోగించుకున్నారు. తొలి విడత పోలింగ్‌లో 22 మండలాల పరిధిలోని 10,72,793 మంది ఓటర్లుండగా వారిలో సగటున 84.30 శాతం మంది ఓటు వేశారు. అత్యధికంగా జంగారెడ్డిగూడెం మండలంలో 89.95 పోలింగ్ నమోదైంది. ఉదయం 11 గంటలకు 30.91 శాతం పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 3గంటలకు 64.26 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇదిలావుండగా, బ్యాలెట్ పేపర్లు వినియోగించడంతో ఓటర్లు కొంత గందరగోళానికి గురయ్యారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు వేర్వేరు బ్యాలెట్ పేపర్లు ఇవ్వగా, వాటిలో ఏ పేపరు ఎవరికి వర్తిస్తుందనే దానిపై తికమకపడ్డారు. దీంతో ఓటు వేసేందుకు ఎక్కువ సమయం తీసుకున్నారు. ఫలితంగా ఓటర్లు గంటల తరబడి లైన్లలో నించున్నారు.
మండలాల వారీగా పోలింగ్ శాతం ఇలా...
మండలం పేరు శాతం
ఏలూరు 79.00
దెందులూరు 85.20
పెదపాడు 85.00
పెదవేగి 84.13
భీమడోలు 82.55
నిడమర్రు 81.48
చింతలపూడి 85.00
ద్వారకా తిరుమల 88.16
గణపవరం 81.51
ఉంగుటూరు 85.26
టి.నర్సాపురం 89.53
మండలం పేరు శాతం
కామవరపుకోట 86.18
లింగపాలెం 89.01
తాడేపల్లిగూడెం 86.62
పెంటపాడు 85.08
నల్లజర్ల 85.84
జంగారెడ్డిగూడెం 89.95
బుట్టాయగూడెం 79.27
జీలుగుమిల్లి 78.86
పోలవరం 79.22
కొయ్యలగూడెం 80.62
గోపాలపురం 87.00
Advertisement