సైకిలుపై చుట్టేశాడు... | British teenager Bicycle trip | Sakshi
Sakshi News home page

సైకిలుపై చుట్టేశాడు...

Published Tue, Oct 20 2015 12:05 AM | Last Updated on Sun, Sep 3 2017 11:12 AM

సైకిలుపై చుట్టేశాడు...

సైకిలుపై చుట్టేశాడు...

తిక్క లెక్క
మన నగరాల్లో సైకిలుపై ఇంటి నుంచి ఆఫీసుకు రాకపోకలు సాగించడమే అరుదు. అలాంటిది గ్లెన్ బర్మీస్టర్ అనే బ్రిటిష్ యువకుడు సైకిలుపై ఏకంగా పదకొండు దేశాలు చుట్టేశాడు. అది కూడా కేవలం వారం రోజుల వ్యవధిలోనే. ఈ సైకిలు యాత్రతో ఇతగాడు సునాయాసంగా గిన్నిస్ రికార్డును బద్దలుకొట్టాడు. కచ్చితంగా చెప్పాలంటే, ఈ యాత్ర పూర్తి చేసేందుకు ఇతగాడికి ఆరు రోజుల పదకొండు గంటల యాభై మూడు నిమిషాలు పట్టింది. బర్మీస్టర్ ఈ యాత్రలో జెక్ రిపబ్లిక్, ఆస్ట్రియా, స్లోవేకియా, హంగెరీ, స్లోవేనియా, క్రొయేషియా, రుమేనియా, సెర్బియా, బోస్నియా అండ్ హెర్జెగోవినా, మాంటెనిగ్రో, అల్బేనియా దేశాలలో పర్యటించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement