సహాయానికి మీరెంత దగ్గర?
సెల్ఫ్ చెక్
కొందరికి ఇతరులకు సహాయం చేయటమంటే చాలా ఇష్టం. మరికొందరు సొంతవాళ్లకు కూడా సహాయ పడరు. మరి మీ తత్వం ఏంటి? మీరు కూడా స్వార్థంగా ఆలోచిస్తారా? లేక పదిమందికి సహాయపడటానికి సిద్ధంగా ఉంటారా? మీ బిహేవియర్ ఎలాంటిదో తెలుసుకోవాలంటే ఈ సెల్ఫ్‌చెక్ పూర్తి చేయండి.
1. అకస్మాత్తుగా మీకు చాలా డబ్బు దొరికితే ఆ ధనమంతా పేదలకు పంచుతారు.
ఎ. అవును బి. కాదు
2. మీ దగ్గర డబ్బు ఉంటే అనాధలను అక్కున చేర్చుకుంటారు.
ఎ. అవును బి. కాదు
3. మిమ్మల్ని అభిమానించేవారికోసం ఎలాంటిపనైనా చేయటానికి సిద్ధంగా ఉంటారు.
ఎ. అవును బి. కాదు
4. బంధువులు చాలామంది ఇంటికొచ్చిన సందర్భంలో మీ సౌలభ్యాన్ని వదులుకొని వారి సౌకర్యానికి ప్రాధాన్యం ఇస్తారు.
ఎ. అవును బి. కాదు
5. సహాయం చేయవలసి వస్తుందని ఎవరితోనూ రిలేషన్స్ మెయింటెయిన్ చేయరు.
ఎ. కాదు బి. అవును
6. మిమ్మల్ని ఎవరైనా సహాయం కోరితే వెంటనే అంగీకరిస్తారు.
ఎ. అవును బి. కాదు
7. అపాయస్థితిలో ఎవరైనా ఉంటే రిస్క్ తీసుకొని మరీ వారికి సహాయం చేస్తారు.
ఎ. అవును బి. కాదు
8. మీరు అనుకున్నది దొరకక పోతే తీవ్రంగా బాధపడిపోతారు.
ఎ. కాదు బి. అవును
9. అనుకోని పరిస్థితుల్లో మీ స్నేహితుడు ప్రమాదంలో పడితే వారికి అండగా నిలుస్తారు.
ఎ. అవును బి. కాదు
10. మీ వస్తువులను ఎవరు తాకినా తీవ్ర ఆగ్రహాన్ని చూపిస్తారు.
ఎ. కాదు బి. అవును
‘ఎ’ లు 7 దాటితే మీరు ఇతరులకు సహాయం చేయటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. పదిమందితో మీకు సత్సంబంధాలు ఉంటాయి. ‘బి’లు ఎక్కువగా వస్తే మీలో స్వార్థ బుద్ధి కాస్త ఎక్కువేనని చెప్పొచ్చు. మీ సుఖం చూసుకున్న తర్వాతే ఇతర విషయాలను పట్టించుకుంటారు. ఇతరులకు సహాయ పడాలంటే మీకు చికాకు. ఇలాంటి పద్ధతిని విడిస్తే మంచిది. మనం ఇతరులకు సహాయ పడితేనే మనం కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం అందుతుందని గుర్తించండి.