సాక్షి, బెంగళూరు : తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం బెంగళూరు, బొటానికల్ గార్డెన్‌లోని మరిగౌడ మెమోరియల్ హాల్‌లో సిరిధాన్యాల శిఖరాగ్ర సభ జరిగింది. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్య విప్లవం తేవడానికి సాక్షి మీడియా గ్రూప్ చేస్తున్న కృషిని డాక్టర్ ఖాదర్ వలీ, శ్యాంప్రసాద్ రెడ్డిలతోపాటు తదితరులు కొనియాడారు.
సాక్షిలో ప్రచురితమైన ఈ విషయాలతో కూడిన 'సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం' పుస్తకాన్ని తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం ప్రచురించింది. ఇప్పటికే ఇంగ్లిష్‌లోకి అనువాదమైన ఈ బుక్‌ను అన్ని భారతీయ భాషల్లోకి అనువాదింపజేసి, ప్రచురిస్తామని ఈ సభలో తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల వేదిక ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే తెలుగు పుస్తకం 8 నెలల్లో 40,000 ప్రతులు ప్రచురితమైందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment