పండుగ ఓణీ | festival special | Sakshi
Sakshi News home page

పండుగ ఓణీ

Published Fri, Jan 12 2018 1:32 AM | Last Updated on Fri, Jan 12 2018 1:32 AM

festival special  - Sakshi

ఓణీ చుడితేనే తెలుగింటి పండుగకు కళ ఓణీ రెపరెపలాడితేనే పెళ్లింట సందడికి సంబరం ఆధునిక డ్రెస్సులు ఎన్ని మెరిసినా సంప్రదాయ లంగా ఓణీయే సంక్రాంతికి ముచ్చటైన రంగవల్లిక.

నేటి రోజుల్లో అమ్మాయిలతో పాటు అమ్మలు కూడా లంగా ఓణీ ధరించి మురిసిపోతున్నారు. హాఫ్‌ శారీ అనబడే లంగా ఓణీలో ఎన్నో డిజైన్స్‌ వచ్చాయి. వాటిలో..
► పట్టు ఎప్పుడూ అగ్రశ్రేణిలో ఉంటుంది. దీంట్లోనూ కంజీవరం, బెనారస్‌లు ముందుండగా మనవైన పోచంపల్లి ఇక్కత్, ధర్మవరం, ఉప్పాడ, నారాయణ్‌పేట.. పట్టు లంగాలు అమ్మాయిలను బుట్టబొమ్మలుగా చూపుతున్నాయి.
► డిజైనర్‌ లెహెంగా కావాలనుకుంటే మాత్రం నెటెడ్‌ ఫ్యాబ్రిక్‌ నేటికీ ముందున్నది. చూడముచ్చటైన రంగుల హంగుల వల్ల నెటెడ్‌ లెహెంగాలను డిజైనర్లు తీరొక్కవిధంగా తీర్చిదిద్దుతున్నారు. నెటెడ్‌ ఫ్యాబ్రిక్‌ మీద ఎంబ్రాయిడరీ సొబగులు, లేసుల జతలు అల్లిబిల్లిగా చేరి అందంగా రూపుకడుతున్నాయి.


కంచిపట్టు  ఫ్యాబ్రిక్‌ లంగా ఓణీకి మంచి అందం తెస్తుంది. శరీరాకృతికి తగ్గట్టు బ్లౌజ్‌కి పొడవు లేదా బుట్ట లేదా పొట్టి చేతులు పెట్టించుకోవాలి. సన్నని అంచు ఉన్న ప్లెయిన్‌ ఓణీ వేసుకుంటే ముచ్చటగా కనిపిస్తారు.

ఫ్యాషన్‌
కంచిపట్టు లాగానే బెనారస్‌ ఫ్యాబ్రిక్‌తో లెహంగాలు రూపొందించుకోవచ్చు. అదే రంగు ప్లెయిన్‌ బ్లౌజ్‌ తీసుకొని, పూర్తి కాంట్రాస్ట్‌ ఓణీ జత చేసుకుంటే లుక్‌ సూపర్బ్‌గా ఉంటుంది.
ఈ లెహెంగాకి ఆంధ్రాలో తయారైన పుట్టపాక శారీని ఎంచుకున్నాను. ప్లెయిన్‌ బ్లౌజ్‌ డిజైన్‌ చేసి, కలంకారీ దుపట్టా జత చేశాను. నగలు హెవీగా ఉండేలా ప్లాన్‌ చేయడంతో ఒక డిఫరెంట్‌ స్టైల్‌ వచ్చింది.

సాదా సీదా – డిజైనర్‌ బ్లౌజ్‌
► ప్లెయిన్‌ని ఇష్టపడేవారు పట్టు పావడాను అదే కాంబినేషన్‌లో ఉన్న పట్టు బ్లౌజ్‌ కుట్టేసి ఆ రెండింటినీ కూర్చుతున్నట్టు ప్లెయిన్‌ ఓణీని వేసుకుంటే పండుగ కళ రెట్టింపు అవుతుంది.
► డిజైనర్‌ బ్లౌజ్‌లలో కలర్‌ కాంబినేషన్స్‌తో పాటు ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్, ప్యాచ్‌ వర్క్, మిర్రర్‌ వర్క్‌.. వంటివి ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇవి డిజైనర్‌ లెహెంగాలకే కాకుండా పట్టు లంగాలకు కూడా బాగా నప్పుతాయి.


ప్లెయిన్‌ ఫ్యాబ్రిక్‌ అదీ పట్టు, రా సిల్క్, నెటెడ్‌.. ఏదైనా తీసుకుంటే పెద్ద పెద్ద అంచులు జత చేయడానికి మార్కెట్‌లో విడిగా డిజైన్‌ చేసిన బార్డర్‌లు లభిస్తున్నాయి. కుచ్చులు కూర్చాక, బార్డర్‌ని జత చేస్తే చాలు చూడముచ్చటైన లెహెంగా రెడీ అవుతుంది.

పండుగకు నప్పే రంగులు
పసుపు, పచ్చ, ఎరుపు రంగుల కాంబినేషన్‌తో రూపుదిద్దుకున్న లంగా ఓణీలు, చీరలు పండుగ కళను రెట్టింపు చేస్తాయి.
వీటి మీదకు టెంపుల్‌ జువెల్రీ లేదంటే పాతకాలం నాటి యాంటిక్‌ జువెల్రీ బాగా నప్పుతాయి.
పొడవాటి జడలు, పువ్వులతో అలంకరణ జడలు లంగాఓణీ కళకు జీవం పోస్తాయి.

నెట్‌ ఫ్యాబ్రిక్‌ వాడినప్పుడు ఆలోవర్‌ డిజైన్‌ తీసుకోవాలి. బ్లౌజ్‌ ఎంబ్రాయిడరీ హెవీగా ఉండాలి. వీటిలో ఫ్లోరల్‌ లేదా ప్రింటెడ్‌ ఫ్యాబ్రిక్‌ తీసుకున్నప్పుడు  లెహెంగా ప్రింట్‌లో బాగా కనిపించే రంగు బ్లౌజ్‌ డిజైన్‌ చేయించుకోవాలి. రెండింటికీ నప్పేలా ఓణీని సెట్‌ చేసుకోవాలి. లెహెంగా మీద ఎంబ్రాయిడరీ వర్క్‌ హెవీగా ఉంటే బ్లౌజ్‌ని ప్లెయిన్‌గా స్టైలిష్‌గా డిజైన్‌ చేయించుకోవాలి. రాసిల్క్, వెల్వెట్‌ లెహెంగాల మీదా ఎంబ్రాయిడరీ గ్రాండ్‌గా తీర్చిదిద్దవచ్చు.

భార్గవి కూనమ్‌, ఫ్యాషన్‌ డిజైనర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement