జంక్‌ఫుడ్ తినడం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయనే సంగతి తెలిసిందే. సాధారణంగా జంక్‌ఫుడ్ వల్ల తలెత్తే స్థూలకాయం, డయాబెటిస్ వంటి నానా సమస్యలకు ఆడా మగా తేడా లేదు. ఈ సమస్యలు జంక్‌ఫుడ్ తినే వారందరిలోనూ కనిపిస్తాయి.
అయితే వారానికి నాలుగుసార్లు లేదా అంతకంటే ఎక్కువసార్లు జంక్‌ఫుడ్ తినే అలవాటు ఉన్న మహిళలకు గర్భందాల్చే అవకాశాలు చాలావరకు సన్నగిల్లిపోతాయని తాజా పరిశోధనలో తేలింది. ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ ఆడిలాయిడ్‌కు చెందిన శాస్త్రవేత్త ప్రొఫెసర్ క్లారీ రాబర్ట్స్ నేతృత్వంలోని అంతర్జాతీయ బృందం జరిపిన పరిశోధనలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
యునైటెడ్ కింగ్‌డమ్, ఐర్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లకు చెందిన ఐదువేల మందికి పైగా గర్భిణుల ఆహారపు అలవాట్లపై కూలంకషంగా అధ్యయనం చేసిన తర్వాత ఈ మేరకు నిర్ధారణకు వచ్చామని ప్రొఫెసర్ క్లారీ రాబర్ట్స్ నేతృత్వంలోని బృందం చెబుతోంది. చిరుతిండిగా పండ్లు, గింజలకు బదులుగా ఫాస్ట్‌ఫుడ్ తినే మహిళల్లో గర్భధారణ అవకాశాలు దాదాపు 16 శాతం మేరకు తగ్గుతాయని గుర్తించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment