ఆంధ్రోడివా...తెలంగాణ వాడివా....? | TRS mla harish rao again abusing Police | Sakshi
Sakshi News home page

ఆంధ్రోడివా...తెలంగాణ వాడివా....?

Published Thu, Jan 9 2014 3:09 PM | Last Updated on Tue, Aug 21 2018 5:44 PM

ఆంధ్రోడివా...తెలంగాణ వాడివా....? - Sakshi

ఆంధ్రోడివా...తెలంగాణ వాడివా....?

టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మరోసారి తన నోటికి పని చెప్పారు. చేయి దురుసే కాకుండా, నోటి దూకుడు జాస్తిగా ఉన్న ఆయన మళ్లీ పోలీసులపై నోరు పారేసుకున్నారు. బండ బూతులు తిడుతూ తన నోటికి పని చెప్పారు. అయితే హరీష్ రావు మాటలను మీడియా చిత్రీకరించడాన్ని పసికట్టి చివరకు నోటికి తాళం వేసుకున్నారు. దాంతో హరీష్ రావు తీరు పోలీస్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.

ఐటీఐఆర్‌ ప్రాజెక్టులో భాగంగా బుధవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గేమింగ్ సిటీ శంకుస్థాపనను అడ్డుకునేందుకు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలతో పాటు హరీష్‌ రావు  అక్కడకు వచ్చారు. అయితే వారిని పోలీసులు  అరెస్టుచేసి అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ఓ పోలీసుపై హరీష్‌ రావు ......నువ్వు ఆంధ్రోడివా... తెలంగాణ వాడివా..?  అంటూ ప్రశ్నించారు. కాగా ఆ పోలీసు మాత్రం తాను ఖమ్మం జిల్లాకు చెందినవాడినని సమాధానం ఇచ్చాడు. ఇంతలో తనను మీడియా గమనిస్తున్నట్లు తెలుసుకున్న హరీష్ రావు నోటికి తాళం వేశారు.   పరుష పదజాలంతో చేసిన వ్యాఖ్యలపై పోలీసు వర్గాల్లో విమర్శలు చెలరేగుతున్నాయి.

తెలంగాణ ఉద్యమ సమయంలోనూ హరీష్ రావు పోలీసులపై చేసిన వ్యాఖ్యలు ...చివరకూ ఆయన క్షమాపణ చెప్పాలంటూ పోలీసు సంఘం ఆందోళనలు చేసేవరకూ వెళ్లాయి. యూజ్ లెస్ ఫెలో, ఓరేయ్ డీసీపీ అంటూ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు  పోలీసు సంఘం భగ్గుమంది.  అంతకు ముందు ఏపీ భవన్ ఓఎస్డీ చందర్రావుపై ఆయన చేయి చేసుకున్న విషయం తెలిసిందే. కాగా  విధుల్లో ఉన్న పోలీసులపై రాజకీయ నేతల ప్రవర్తన దురుసుగా మారుతోందని ఆరోపణలు ఉన్నాయి. ఇతరులకు ఆదర్శంగా ఉండాల్సిన రాజకీయ నేతలే  సహనం కోల్పోయి....దురుసుగా ప్రవర్తించటం విమర్శలకు దారి తీస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement