ఎలిగెంట్ బ్రైడల్ స్టయిల్ | Eligent Bridal Hair styles | Sakshi
Sakshi News home page

ఎలిగెంట్ బ్రైడల్ స్టయిల్

Published Sun, Jun 12 2016 1:57 AM | Last Updated on Mon, Sep 4 2017 2:15 AM

ఎలిగెంట్ బ్రైడల్ స్టయిల్

ఎలిగెంట్ బ్రైడల్ స్టయిల్

సిగ సింగారం
ఇది ఎలిగెంట్ బ్రైడల్ హెయిర్ స్టయిల్స్‌లో ఒక రకం. దీన్ని విదేశీయులు వివాహ వేడుకల్లో ఎక్కువగా వేసుకుంటారు. వారే కాదు.. ఇటీవల మన భారతీయులు కూడా ఈ హెయిర్ స్టయిల్‌ను బాగా అనుసరిస్తున్నారు. ఇది లాంగ్‌స్కర్ట్స్, గాగ్రా, గౌన్ల మీదకు చక్కగా నప్పుతుంది. అంతేకాదు.. పట్టుచీరల మీదకు కూడా భలే సూట్ అవుతుంది. దీన్ని వేసుకోవడానికి జుత్తు మరీ పొడవుగా ఉండాల్సిన అవసరం లేదు. ఓ మాదిరిగా ఉంటే సరిపోతుంది. కాబట్టి అందరూ ఈ హెయిర్ స్టయిల్‌ను ట్రై చేయొచ్చు.
 
* ముందుగా జుత్తునంతా చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. సాఫ్ట్‌గా ఉండేందుకు హెయిర్ స్ప్రే చేసుకుంటూ దువ్వుకోవాలి. తర్వాత రెండువైపులా కాస్త జుత్తును వదిలేసి, ఫొటోలో కనిపిస్తున్న విధంగా మధ్యభాగంలోని జుత్తును తీసుకోవాలి. దాన్ని కొద్దిగా మెలితిప్పి స్లైడ్ పెట్టేయాలి.
     
* ఇప్పుడు ఫొటోలో కనిపిస్తున్న విధంగా సైడ్ నుంచి కొద్దిగా జుత్తును తీసుకొని ఫోల్డ్ (రిబ్బన్ కట్టడానికి ఫోల్డ్ చేసినట్ట్టు) చేసి స్లైడ్ పెట్టాలి. అలాగే మరోవైపు నుంచి కూడా జుత్తును తీసుకొని ఫోల్డ్ చేసి స్లైడ్ పెట్టాలి.
     
* మొదట వదులుకున్న ఇరువైపుల జుత్తును ఇప్పుడు పై విధంగానే ఫోల్డ్ చేసి స్లైడ్స్ పెట్టేయాలి.
     
* యథాతథంగా కింద మిగిలిన జుత్తును ఇరువైపుల నుంచి తీసుకొని మరో స్టెప్ ఫోల్డ్ చేసుకోవాలి.
         
* తర్వాత చివర మిగిలిన కొద్ది జుత్తును సింగిల్ ఫోల్డ్ చేసి, లోపలికి మడిచి స్లైడ్స్ పెట్టేయాలి. కొప్పులోంచి పొట్టి జుత్తు బయటికి రాకుండా అక్కడక్కడా స్లైడ్స్ పెట్టి, హెయిర్ స్ప్రే చేసుకోవాలి. ఫొటోలో కనిపిస్తున్నట్టుగా ఏదైనా పెద్దసైజు ఫ్లవర్‌తో కొప్పును అలంకరించుకోవాలి.
     
* ఇప్పుడు పూసలున్న పిన్స్‌ను తీసుకొని కొప్పుకు రెండు లైన్లలో కుచ్చుకోవాలి. దాంతో మీ హెయిర్ స్టయిల్ ఎంతో అందంగా ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement