‘నేనే ఇలా ఎందుకమ్మా..’ అని అమ్మని పట్టుకుని ఏడ్చేదాన్ని: హీరోయిన్‌ | Sonam Kapoor Suffers Pcos Facial Hair And Motivated By Kajol Unibrow, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

‘నేనే ఇలా ఎందుకమ్మా..’ అని అమ్మని పట్టుకుని ఏడ్చేదాన్ని: హీరోయిన్‌

Published Tue, Nov 26 2024 10:12 AM | Last Updated on Tue, Nov 26 2024 10:56 AM

Sonam Kapoor suffers pcos facial hair  and motivated by Kajol unibrow

ఇలా ఉందేంటీ..? ఈ అమ్మాయి!

ట్రోల్‌ చేసి మనల్ని వెనక్కు లాగేవాళ్లు ఉన్నట్లే, మోటివేట్‌ చేసి ముందుకు నడిపించే వాళ్ళూ ఉంటారు. సోనమ్‌ కపూర్‌ను అలా ముందుకు నడిపించిన వ్యక్తి కాజోల్‌. అయితే కాజోల్‌ కు సోనమ్‌ ఆ సంగతి నేరుగా ఎప్పుడూ చెప్పలేదు. మనసులోనే ఉన్న కాజోల్‌ నుంచి ప్రేరణను పొందారు సోనమ్‌. 

సినిమాల్లో కాజోల్‌ పీక్‌ దశను కూడా దాటేసి ఉన్నప్పుడు సోనమ్‌ వయసు 16. పదహారు అంటే పుస్తకాల్లో రాసినట్లు స్వీట్‌ సిక్స్‌ టీనే కానీ, అందరి విషయంలోనూ స్వీట్‌ కాక΄ోవచ్చు. ఆ వయసులో సోనమ్‌ అందమైన, లేత ముఖం మీద వెంట్రుకలు కనిపించేవి. పెద్ద పెద్ద మొటిమలు ఉండేవి. బరువు కూడా పెరిగింది. తనకు పాలిసిస్టిక్‌ ఓవరీ సిండ్రోమ్‌ (పీసీఓఎస్‌) ఉందనీ, ముఖంపై వెంట్రుకలు రావటం, బరువు పెరగటం, మొటిమలు.. ఇవన్నీ పీసీఓఎస్‌వల్లనేనని ఫ్యామిలీ డాక్టర్‌ తొలిసారి చెప్పినప్పుడు సోనమ్‌ కుంగి పోయింది. తల్లిని చుట్టేసుకుని బావురుమంది. 

అయితే సోనమ్‌కు అంతకన్నా పెద్ద కష్టం వచ్చి పడింది! అందరూ ఆమెను చూసి, ‘అనిల్‌ కపూర్‌ కూతురు కదా..’ అనేవాళ్లట.. ‘ఇలా ఉందేమిటి!!’ అనే అర్థంలో! (యువతుల డ్రీమ్‌ బాయ్‌ అని అనిల్‌ కపూర్‌కు పేరు). పాపం నాన్న పేరు పోతోందే నా కారణంగా..’ అని సోనమ్‌ బాధపడుతుండేది. ‘నేనే ఇలా ఎందుకు ఉన్నానమ్మా..’ అని తల్లిని పట్టుకుని కంటతడి పెట్టుకునేది.

ఓరోజు తల్లి ఆమెకు కాజోల్‌ ఫొటో చూపించి, ‘తను స్టార్‌ హీరోయిన్‌ కదా. అయితే ఆ కనుబొమలు చూడు. రెండూ కలిసిపోయి ఉన్నాయి. కొందరికి ఇలానే ‘యూనిబ్రో’ ఉంటుంది. అయినా సరే ఆమె ఎప్పుడూ తన కనుబొమలు షేప్‌ చేయించుకోలేదు. అలాగే ఉంచేసుకున్నారు. అందమంటే అది బంగారం, ఆమెలోని ఆ సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్‌ అని చెప్పారు. 

తల్లి మాటలు సోనమ్‌లో బాగా నాటుకుపోయాయి. ఆమె ముఖం సంతోషంతో వెలిగిపోయింది. కాజోల్‌కు మనసులోనే థాంక్స్‌ చెప్పుకుంది. తనను ట్రోల్‌ చేసే వాళ్లను పట్టించుకోవటం మానేసింది. సోనమ్‌కు పదహారు దాటి 17 లోకి రాగానే దర్శకుడు సంజయ్‌ లీలా బన్సాలీ దగ్గర అవకాశం వచ్చింది. ఆయన ‘బ్లాక్‌’ సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేశారు సోనమ్‌. తర్వాత 2007 లో నటిగా తన తొలి చిత్రం ‘సావరియా’ తో బాలీవుడ్‌ లోకి ప్రవేశించారు. ఆ తర్వాత తన తండ్రితో కలిసి ఒక చిత్రంలో కూడా కనిపించారు. తన పీసీఓఎస్‌ఎప్పుడు మాయమై΄ోయిందో కూడా సోనమ్‌కి గుర్తులేదు. ట్రోల్స్‌ కూడా అంతే. వస్తాయి.  పోతాయి. 

‘అంత పెద్ద స్టార్‌ అయిండీ కాజోల్‌ తన యూనిబ్రోని ఒక సమస్యగా తీసుకోకపోవటం అన్నది నాలో అంతర్లీనంగా పని చేసి, స్ఫూర్తిని నింపింది..’ అని తాజాగా బర్ఖాదత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు సోనమ్‌ కపూర్‌.  

ఇదీ చదవండి:  ఐపీఎల్‌ వేలం 2025 : అదిరే డ్రెస్‌లో నీతా అంబానీ, ధర ఎంతో తెలుసా?


 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement