ఎగిరే చేప..!
చేపను పోలిన శరీర నిర్మాణంతోనే నీటిలో ఈదుతూ గాల్లో కూడా ఎగరగలిగే శక్తి ఉన్నది ఫ్లయింగ్ ఫిష్. సాధారణంగా చేపకు ఈదడానికి సహకరించే భాగాలే దీనికి గాల్లో ఎగరడానికి కూడా అవకాశాన్ని ఇస్తాయి. సముద్రాల్లోని తన కన్నా పెద్ద జీవుల నుంచి ఎక్కువ ప్రమాదాలను ఎదుర్కొనే ఫ్లయింగ్‌ఫిష్‌లు ఉపరితలం వరకూ వచ్చి డైవ్ కొట్టేసి వాటి ముప్పు నుంచి బయటపడుతూ ఉంటాయి.
తమ శక్తిని అంతటినీ కేంద్రకరించుకొని ఇవి నీటి ఉపరితలాన్ని చొచ్చుకొని వచ్చి గాల్లో ఎగురుతూ తిరిగి నీటిలోకి దూకుతాయి. దీనికి అనువుగా ఉంటుంది వీటి శరీర నిర్మాణం. ఇవి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఎగురుతాయి. ఒక్కసారి ఉపరితలం నుంచి బయటకొచ్చిన తర్వాత కనిష్టంగా 1.2 మీటర్లు, గరిష్టంగా 200 మీటర్ల దూరాన్ని ఎగరగలుగుతాయి. ప్రధానంగా ధ్రువ ప్రాంతాలకు దూరంగా ఉండే వెచ్చనినీటి సముద్రాల్లో ఫ్లయింగ్ ఫిష్‌లు ఉంటాయి. వీటిలో దాదాపు 40 ఉపజాతులున్నాయి.