శంషాబాద్ లో మళ్లీ బంగారం స్వాధీనం
Published Fri, Mar 11 2016 9:35 AM | Last Updated on Sun, Sep 3 2017 7:30 PM
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి బంగారం పట్టుబడింది. శక్రవారం ఉదయం తనిఖీలు చేపట్టిన కస్టమ్స్ అధికారులు ఓ ప్రయాణికుడి నుంచి 465 గ్రాములు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజు దుబాయి నుంచి వచ్చిన విమాన ప్రయాణికులను సోదా చేయగా ప్రయాణికుడి వద్ద బంగారం లభించింది. అందుకు సంబందించిన ఎటువంటి రసీదులు లేకపోవడంతో ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. ప్రయాణికుడి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement