తల్లిని కొట్టి చంపిన కసాయి కొడుకు | son kills his mother in krishna district | Sakshi
Sakshi News home page

తల్లిని కొట్టి చంపిన కసాయి కొడుకు

Published Tue, Oct 27 2015 11:37 AM | Last Updated on Mon, Jul 29 2019 5:43 PM

son kills his mother in krishna district

గుడివాడ: కృష్ణాజిల్లా గుడివాడలో దారుణం జరిగింది. తన భార్యను వేధిస్తోందంటూ కన్నతల్లిని ఓ కసాయి కొడుకు కొట్టిచంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

గుడివాడలోని శ్రీరాంపురం ప్రాంతానికి చెందిన రాజశేఖర్ ఆరు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. తల్లిదండ్రులతో పాటే అందరూ కలసి ఉంటున్నారు. అయితే, రాజశేఖర్ తల్లి నాగమణి(45)కి కోడలు తీరు నచ్చలేదు. ఇంట్లోంచి వెళ్లిపోవాలంటూ ఆమెపై ఒత్తిడి చేస్తోంది. ఇది నచ్చని రాజశేఖర్ తల్లిని చంపేందుకు పథకం పన్నాడు. సోమవారం రాత్రి నిద్రమాత్రలు పాలలో కలిపి తల్లికి ఇచ్చాడు. ఆమె మత్తులో పడిపోగా సుత్తితో తలపై కొట్టి చంపాడు. మంగళవారం ఉదయం విషయం తెలిసిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఇంట్లోనే ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement