తొక్కిసలాట ఘటన బాధాకరం: కవిత
నిజామాబాద్ : ఏపీ లోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి కోటగుమ్మం పుష్కర ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన బాధాకరమని టీఆర్ఎస్ ఎంపీ కవిత అన్నారు. పుష్కర సమయంలో ఇలాంటి ఘటన జరగటం విచారకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఆమె ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పుష్కర ఘాట్ వద్ద తొక్కిసలాట జరిగి 25 మంది మృతిచెందడంతో పాటు మరికొంత మంది గాయపడ్డ విషయం తెలిసిందే. గాయపడిన వారు రాజమండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.