‘ఇమ్యునో థెరపీ’తో కేన్సర్ రోగుల జీవితకాలం పెంపు
- రక్త పరీక్షతోనూ కేన్సర్ గుర్తింపు
- అపోలో వైద్య నిపుణులు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ‘కేన్సర్ వైద్యంలో ఇమ్యునో థెరపీ విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతోంది. ఇందుకు సంబంధించిన ప్రాథమిక పరిశోధనలు మెరుగైన ఫలితాలి స్తున్నాయి. భవిష్యత్తులో కేన్సర్ చికిత్సకు ఇది అత్యంత కీలకంగా మారబోతోంది’ అని అపోలో కేన్సర్ ఆస్పత్రి వైద్యులు అభిప్రాయ పడ్డారు. వచ్చే నెల 2 నుంచి జరగనున్న ‘అపోలో కేన్సర్ కాన్‌క్లేవ్–2017’ను పురస్క రించుకుని సోమవారం హోటల్ తాజ్ దక్కన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ పి.విజయ్ ఆనంద్‌రెడ్డి, వైస్ చైర్మన్ డాక్టర్ ఎస్‌వీఎస్‌ఎస్ ప్రసాద్, ఆర్గనైజింగ్ కార్యదర్శి డాక్టర్ టీపీఎస్ భండారి, డాక్టర్ కౌశిక్ భట్టాచార్యా ఈ వివరాలు వెల్లడించారు. తొలిదశలో కేన్సర్‌ని గుర్తించకపోవడం, తీరా గుర్తించే సమయానికి వ్యాధి మరింత ముదిరి పోతోంది. మూడు, నాలుగో స్టేజ్‌లో ఆస్పత్రికి వచ్చే రోగులకు ఇమ్యునో థెరపీ ద్వారా వారి జీవిత కాలం రెండు నుంచి మూడేళ్ల వరకు పెంచవచ్చు. ఈ చికిత్స మరో రెండు మూడేళ్లలో అందుబాటులోకి రావచ్చు.
సీటీ, ఎక్సరేలతో కేన్సర్ ముప్పు...
అవసరం లేకపోయినా తరచూ సీటీ స్కాన్ తీయించుకోవడం వల్ల భవిష్యత్తులో కేన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ఒక సీటీస్కాన్ 20 ఎక్సరేలతో సమానం. ప్రతి 15 మందిలో ఒకరు ఏదో ఒక కేన్సర్‌తో బాధపడు తున్నారు. శరీరానికి వ్యాయామం లేకపోవ డం, వేపుడు, మసాలా ఆహారం అధికంగా తినడం, మద్యం, మాంసం అతిగా తినడం వల్ల చాలా మంది చిన్నతనంలోనే కేన్సర్ బారిన పడుతున్నారు. సరైన ఆహారం, వ్యాయామం వల్ల 50 శాతం కేన్సర్లు రాకుండా కాపాడుకోవచ్చు.
కాన్‌క్లేవ్‌కు దేశవిదేశాల ప్రతినిధులు..
కేన్సర్ వైద్య చికిత్సల్లో అందుబాటులోకి వచ్చిన పరిజ్ఞానంపై భావితరం వైద్యులకు అవగాహన కల్పించడంతో పాటు విజ్ఞానాన్ని పంచుకొనేందుకు ఫిబ్రవరి 2 నుంచి 5 వరకు హెచ్‌ఐసీసీలో అపోలో కేన్సర్ కాన్‌క్లేవ్–2017 నిర్వహిస్తున్నట్లు సదస్సు చైర్మన్ విజయ్ ఆనంద్‌రెడ్డి తెలిపారు. 2,500 మంది దేశ విదేశాల ప్రతినిధులు, 300 మంది కేన్సర్ నిపుణులు హాజరవుతారన్నారు. 4న కేన్సర్ విజేతలతో ఓపెన్‌హౌస్ కార్యక్రమం ఏర్పాటు చేశామని, దీనికి ప్రముఖ నటి మనీషా కోయిరాల హాజరు కానున్నట్లు తెలిపారు.
రక్త పరీక్షతో కేన్సర్ కణాల గుర్తింపు...
కేన్సర్ బాధితుల్లో ప్రతి ఇద్దరిలో ఒకరు చనిపోతున్నారు. ఇప్పటివరకు బయాప్సీ ద్వారా మాత్రమే కేన్సర్ కణా లను గుర్తిస్తున్నారు. ఊపిరితిత్తులు, పెద ్దపేగు, బ్రెయిన్ కేన్సర్‌ల విషయంలో ఈ బయాప్సీ సాధ్యం కాదు. క్లిష్టమైన భాగాల్లోని టిష్యూని సేకరించడం కష్టం. ప్రస్తుతం రక్త పరీక్ష ద్వారా కూడా కేన్సర్ కణాలను గుర్తించే పరిజ్ఞానం అందు బాటులోకి వచ్చింది. అంతే కాదు ఏ కేన్సర్‌కు ఏ డ్రగ్ పనిచేస్తుందనే అంశాన్ని కూడా ముందే తెలుసుకునే వీలుంది.