మారుమూల ప్రాంతాల్లో ప్రత్యేక వైద్యసేవలు
సాక్షి, హైదరాబాద్: కార్మిక రాజ్య బీమా సంస్థ(ఈఎస్‌ఐ) కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. ఈఎస్‌ఐ కార్డు కలిగిన కార్మికులకు మరింత చేరువలో వైద్య చికిత్సలు అందించేందుకు మొబైల్ అంబులెన్స్‌లను ప్రవేశపెట్టాలని నిర్ణయిం చింది. ఆస్పత్రులు, డిస్పెన్సరీలు, ప్యానల్ క్లీనిక్‌లు అందుబాటులోలేని మారుమూలప్రాంతాల్లో మొబైల్ అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచాలని భావిస్తోంది. ఈ అంబులెన్స్‌ల్లో రక్త, మూత్ర పరీక్షలతోపాటు బయోకెమిస్ట్రీ, పెథాలజీ, హిస్టోపెథాలజీకి చెందిన 76 పరీక్షలు నిర్వహించే సౌకర్యాలు కల్పిస్తోంది. అంబులెన్స్‌లో ఒక వైద్యుడు, ల్యాబ్ టెక్నీషియన్ ఉండేలా చర్యలు తీసుకుంది. ఈ మేరకు తొలి విడతలో తెలంగాణకు పది వాహనాలు కేటాయించింది.
వీటిని నిజామాబాద్, ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వినియోగించాలని ఈఎస్‌ఐసీ భావిస్తోంది. ఈఎస్‌ఐ సేవలు ప్రస్తుతం పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యాయి. నిబంధనల మేరకు ఒక ప్రాంతంలో ఈఎస్‌ఐ కార్డు కలిగిన 2 వేల కార్మికులు ఉంటేనే అక్కడ డిస్పెన్సరీలు ఏర్పాటు చేస్తారు. అంతకంటే ఎక్కువ ఉంటే ఆస్పత్రులను ఏర్పాటు చేస్తారు. అంతకంటే తక్కువ మంది ఉన్నచోట వైద్య సేవలు అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్న విషయా న్ని ఈఎస్‌ఐ గుర్తించింది. ఈ నేపథ్యంలో మొబైల్ సేవలకు నడుం బిగించింది. సులభంగా కార్మికుల చెంతకు చేరేందుకు టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతమున్న 108, 104 అంబులెన్స్ తరహాలో కార్మికులకు సులభంగా గుర్తిండిపోయేలా ఒక నంబర్ ఏర్పాటు చేయనున్నారు.
ఇక ఈఎస్‌ఐ మొబైల్ అంబులెన్స్‌లు!
Published Fri, Sep 16 2016 1:22 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement
Advertisement