గాంధీ ఆస్పత్రిలో వైద్యులు డిష్యూం డిష్యూం...
హైదరాబాద్ : హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో డాక్టర్ల మధ్య గొడవలు రోగుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. అనస్తీషియన్ డాక్టర్ నాగార్జున, ఆర్థోపెడిక్ డాక్టర్ రవిబాబు గురువారం ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. దీంతో అనస్తీషియా విభాగం వైద్యులు విధులు బహిష్కరించారు. మత్తు ఇంజెక్షన్స్ ఇవ్వకపోవడంతో పలు ఆపరేషన్ ధియేటర్లను మూసేశారు. రోగులను ఆపరేషన్ థియేటర్ వరకూ తీసుకెళ్లి, అనస్తీషియా ఇచ్చేవారు లేక మళ్లీ వార్డులకు తీసుకొచ్చారు.
దీంతో రోగులు అయోమయానికి గురయ్యారు. ప్రాణాలను కాపాడాల్సిన వైద్యులు పంతాలకు పోయి విధులకు హాజరు కాకపోవటంతో రోగులు ఆందోళన చెందుతున్నారు. తమను పట్టించుకోవటం లేదని రోగులు మండిపడుతున్నారు. డాక్టర్ల మొండి వైఖరితో దాదాపు 90 ఆపరేషన్లు ఆగిపోయాయి. ఇదిలా ఉండగా, తాను ఎవ్వరిపైనా దాడి చేయలేదని, విధి నిర్వహణలో భాగంగా మందలించానని దానికి పెద్ద సీన్ క్రియేట్ చేశారని రవిబాబు ఆరోపిస్తున్నారు.