ఆత్మరక్షణకే కాల్పులు
హోంమంత్రి నాయిని
హైదరాబాద్ : రాజీవ్ రహదారిని ముట్టడించే క్రమం లో ముందుగా మల్లన్నసాగర్ నిర్వాసితులే పోలీసులపై రాళ్లు రువ్వి, కర్రలతో దాడి చేశారని.. దాంతో పోలీసులు ఆత్మరక్షణకోసం లాఠీచార్జి, కాల్పు లు జరిపారని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు.
సోమవారం వీఎస్‌టీలో హరితహారంలో పాల్గొన్న ఆయన విలేకరుల తో మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ తెచ్చిన చట్టం ప్రకారం నష్టపరిహారం ఎకరాకు రూ.2 లక్షలే వస్తుందని, తాము తీసుకువచ్చిన 123 జీవో వల్ల ఎకరాకు రూ.6లక్షలతో పాటు ఇళ్లకు ఇళ్లు.. ఇలా ఏవి నష్టపోతే అవి ఇస్తామని తెలిపారు. ప్రతిపక్షాలకు ఏదీ దొరక్క దీనిపై కావాలని రాద్ధాంతం చేస్తున్నాయన్నారు.