![శ్రీకాంత్ 'మెంటల్ పోలీస్' విడుదలపై స్టే - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/51461567965_625x300.jpg.webp?itok=__TlF1AQ)
శ్రీకాంత్ 'మెంటల్ పోలీస్' విడుదలపై స్టే
హైదరాబాద్: శ్రీకాంత్ హీరోగా నటించిన మెంటల్ పోలీస్ సినిమా విడుదలపై హైకోర్టు స్టే విధించింది. ఈ సినిమా టైటిల్పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసు అధికారుల సంఘం దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు సోమవారం విచారించింది. వాదనలు విన్న అనంతరం మెంటల్ పోలీస్ విడుదలపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
పోలీసుల మనోభావాలు దెబ్బతినేలా 'మెంటల్ పోలీస్' టైటిల్ పెట్టినందుకు నిర్మాత, దర్శకులతోపాటు హీరో శ్రీకాంత్‌కు పోలీసు అధికారుల సంఘం లీగల్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. పోలీసులకున్న గౌరవ మర్యాదలను కించపరిచేలా సినిమా పేరు పెట్టారని, దాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేసింది. శ్రీకాంత్, అక్ష జంటగా కరణం పి.బాబ్జీ దర్శకత్వంలో వీవీఏఎన్ ప్రసాద్ దాసరి, వీవీ దుర్గాప్రసాద్ అనగాని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు.