5 నుంచి స్కాల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ | Skal World Congress from october 5th | Sakshi
Sakshi News home page

5 నుంచి స్కాల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌

Published Tue, Sep 12 2017 1:08 AM | Last Updated on Tue, Sep 19 2017 4:22 PM

Skal World Congress from october 5th

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రాజధాని నగరం మరో ప్రతిష్టాత్మక సదస్సుకు వేదిక కాబోతోంది. పర్యాటక రంగంలో పేరొందిన ట్రావెల్‌ ఆర్గనైజేషన్‌ ‘స్కాల్‌ (ఎస్‌కేఏఎల్‌)’78వ వరల్డ్‌ కాంగ్రెస్‌ సదస్సుకు ఈసారి హైదరాబాద్‌ను ఎంపిక చేశారు. అక్టోబర్‌ 5 నుంచి 9 వరకు హెచ్‌ఐసీసీలో ఈ సదస్సు జరగనుంది.

85 దేశాలకు చెందిన దాదాపు వెయ్యి మంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉన్న ఈ సదస్సును రాష్ట్ర సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రారంభిస్తారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, కేంద్ర పర్యాటక శాఖ కార్యదర్శి తదితరులు హాజరు కానున్నట్లు పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం సోమవారం వెల్లడించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement