అనుశ్రీ ఆచూకీ దొరికింది | TCS employee anushree found at patancheru | Sakshi
Sakshi News home page

అనుశ్రీ ఆచూకీ దొరికింది

Published Wed, Feb 10 2016 12:23 PM | Last Updated on Mon, Oct 22 2018 7:50 PM

అనుశ్రీ ఆచూకీ దొరికింది - Sakshi

అనుశ్రీ ఆచూకీ దొరికింది

హైదరాబాద్: సాఫ్ట్వేర్ ఉద్యోగిని అనుశ్రీ(22) ఆచూకీ లభ్యమైంది. ప్రస్తుతం ఆమె పటాన్ చెరు పోలీసులు అదుపులో ఉంది. ఆమె సురక్షితంగా ఉందన్న సమాచారంతో తల్లిదండ్రులు, సహోద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. టీసీఎస్లో ఆదిభట్ల బ్రాంచ్లో పని చేస్తున్న అనుశ్రీ సోమవారం అదృశ్యమైంది. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. శివారు ప్రాంతాల్లో ఆమె సంచరించినట్టు గుర్తించారు. చివరకు పటాన్ చెరు సమీపంలో ఆమె ఆచూకీ కనిపెట్టారు. ఆమెను గచ్చిబౌలి పోలీసులకు అప్పగించనున్నారు.

కర్ణాటకకు చెందిన అనుశ్రీ గచ్చిబౌలిలోని దివ్యశ్రీ ఉమెన్స్ పీజీ హాస్టల్లో ఉంటోంది. సోమవారం ఆమె తనకు ఆరోగ్యం బాగోలేదని తండ్రి ప్రభాకర్కి ఫోన్ చేసింది. అయితే తాను హైదరాబాద్కు వచ్చి హాస్పటల్కు తీసుకు వెళతానని కంగారు పడవద్దని కుమార్తెకు నచ్చచెప్పారు. అనంతరం అనుశ్రీకి ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో ప్రభాకర్ కర్ణాటక నుంచి హైదరాబాద్ వచ్చారు. హాస్టల్లో ఎంక్వైరీ చేయగా, అనుశ్రీ ఆఫీస్కు వెళుతున్నట్లు చెప్పిందని తెలిపారు. దీంతో ఆయన టీసీఎస్ కార్యాలయానికి వెళ్లగా అక్కడకు కూడా అనుశ్రీ రాలేదని తెలిపింది. దీంతో ప్రభాకర్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement