టీసీఎస్ మహిళా ఉద్యోగిని అదృశ్యం | TCS employee snusree missing, case filed | Sakshi
Sakshi News home page

టీసీఎస్ మహిళా ఉద్యోగిని అదృశ్యం

Published Tue, Feb 9 2016 3:37 PM | Last Updated on Mon, Oct 22 2018 7:50 PM

టీసీఎస్ మహిళా ఉద్యోగిని అదృశ్యం - Sakshi

టీసీఎస్ మహిళా ఉద్యోగిని అదృశ్యం

హైదరాబాద్ : ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. టీసీఎస్లో ఆదిభట్ల బ్రాంచ్లో పని చేస్తున్న అనుశ్రీ (22) అదృశ్యం కావడంతో తల్లిదండ్రుల ఫిర్యాదుతో  పోలీసులు కేసు నమోదు చేశారు. కర్ణాటకకు చెందిన అనుశ్రీ గచ్చిబౌలిలోని దివ్య శ్రీ ఉమెన్స్ పీజీ హాస్టల్లో ఉంటోంది. సోమవారం ఆమె తనకు ఆరోగ్యం బాగోలేదని తండ్రి ప్రభాకర్కి ఫోన్ చేసింది. అయితే తాను హైదరాబాద్కు వచ్చి హాస్పటల్కు తీసుకు వెళతానని కంగారు పడవద్దని కుమార్తెకు నచ్చచెప్పారు.

 

అనంతరం అనుశ్రీకి ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో ప్రభాకర్ కర్ణాటక నుంచి  హైదరాబాద్ వచ్చారు. హాస్టల్లో ఎంక్వైరీ చేయగా, అనుశ్రీ ఆఫీస్కు వెళుతున్నట్లు చెప్పిందని తెలిపారు. దీంతో ఆయన టీసీఎస్ కార్యాలయానికి వెళ్లగా అక్కడకు కూడా అనుశ్రీ రాలేదని తెలిపింది. దీంతో ప్రభాకర్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement