హైదరాబాద్: 60 శాతం కాలేజీలను రాత్రికి రాత్రి కౌన్సిలింగ్‌కు దూరం చేయడం దారుణం అని తెలంగాణ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్య ప్రతినిధులు పేర్కొన్నారు. ఏవైనా లోపాలు ఉంటే తమకు అవకాశమిస్తే సరిదిద్దుకునేవాళ్లం కదా అని వారు అన్నారు. ఉగ్రవాది కసబ్‌ను కూడా చివరి కోరిక అడిగారని వారు గుర్తు చేశారు. కాలేజీల అఫ్లియేషన్ రద్దుతో వేలాది సిబ్బంది కుటుంబాలు రోడ్డున పడనున్నాయన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ నుంచి తప్పించుకునేందుకు కాలేజీల విషయంలో ఇలా చేశారనుకుంటున్నాట్లు తెలిపారు. కేవలం జెఎన్టియు పరిధిలోనే 174 కాలేజీలను పక్కనపెట్టడానికి వీసీ రామేశ్వరరావు కారణం అని వారు అన్నారు. జెఎన్టియు వీసీ తనకు చెందిన కాలేజీలకు లబ్ది జరిగేలా తమపై కఠినంగా వ్యవహరించారని వారు ఆరోపించారు. అనుమతి ఉన్న 141 కాలేజీలలో అడ్మిషన్లు జరగకుండా అడ్డుకుంటామని వారు హెచ్చరించారు.