కెనడా: ధోరియా తుపాను కెనడాలో భారీ విధ్వంసాన్ని సృష్టించింది. శనివారం అట్లాంటిక్ సముద్ర తీరంలో ప్రవేశించిన ఈ తుపాను విజృంభించి అతలాకుతలం చేసింది. పెనుగాలులు వీయడంతో చెట్లు విరిగిపోగా, విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు చీకట్లోనే బిక్కుబిక్కుమంటు గడిపారు. ఇలాంటి పరిస్థితుల్లో తీవ్ర గాలుల ధాటికి తట్టుకోలేక కుప్పకూలిన క్రేన్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్థు భవనంపై భారీ క్రేన్ కుప్పకూలిపోయింది. దీంతో అక్కడి స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
తుపాను సృష్టించిన బీభత్సం వల్ల భారీ క్రేన్ కూలిపోవటం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ భయోత్పాత వీడియోను ఇప్పటివరకు లక్షల మందికి పైగా వీక్షించగా పలువురు వారి అభిప్రాయలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. క్రేన్.. గాలికి చిగురుటాకులా వణికిపోయేందేంటని కొందరు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేయగా.. క్రేన్ పడిపోలేదని భవనాన్ని రక్షిస్తోందని మరికొందరు కామెంట్ చేశారు.
#HurricaneDorian makes landfall in the east of #Canada of a crane fell on a building under construction in the city of Halifax. pic.twitter.com/Q8D2cxoGMn
— Joint Cyclone Center (@JointCyclone) September 7, 2019
Comments
Please login to add a commentAdd a comment