స్నేక్‌తో సెల్ఫీలొద్దురో...! | Man may lose hand after taking "selfie" with rattlesnake | Sakshi
Sakshi News home page

స్నేక్‌తో సెల్ఫీలొద్దురో...!

Published Sun, Aug 30 2015 1:00 AM | Last Updated on Sun, Sep 3 2017 8:21 AM

స్నేక్‌తో సెల్ఫీలొద్దురో...!

స్నేక్‌తో సెల్ఫీలొద్దురో...!

 'సింహం పడుకుంది కదాని చెప్పి జూలుతో జడేయకూడదురా! అలాగే పులి పలకరించింది కదా అని పక్కన నిలబడి ఫోటో తీయించుకోకూడదురోయ్...'ఓ సినిమాలో పవన్ కల్యాణ్ పంచ్ డైలాగ్ ఇది. పాపం... అమెరికన్లు ఇది వినే చాన్స్ లేదుగా! అందుకే కాలిఫోర్నియా రాష్ట్రంలోని లేక్ ఎల్సినోర్‌కు చెందిన అలెక్స్ గోమెజ్ (36) తన వ్యవసాయక్షేత్రంలో ఓ తాచుపాము కనపడగానే చాకచాక్యంగా పట్టేశాడు. దాన్ని దూరంగా వదిలేస్తే సమస్యే ఉండేది కాదు.

బహుశా సోషల్ మీడియాలో పోస్ట్ చేద్దామని కాబోలు ... స్నేక్‌తో సెల్ఫీ దిగే ప్రయత్నం చేశాడు. తాచు ఊరుకుంటుందా... అదును చూసి కసుక్కున కాటేసింది. గోమెజ్ లబోదిబోమంటూ ఆస్ప్రతికి పరుగెత్తాడు. చెయ్యి తీసేసే ప్రమాదం కూడా ఉందట. జూలైలోనే కాలిఫోర్నియాలో టాడ్ ఫాస్లర్ అనే మహానుభావుడు ఇలాంటి సెల్ఫీ ప్రయత్నమే చేయగా... చేతిపై పాము కాటేసింది. చెయ్యి పూర్తిగా నీలం రంగులోకి మారిపోవడంతో ఫాస్లర్‌కు ఏకంగా కోటి రూపాయల పైచిలుకు ఆసుపత్రి బిల్లు అయ్యిందట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement