నరేంద్ర మోడీకి పాక్ ప్రధాని లేఖ | Nawaz Sharif writes letter to Narendra Modi | Sakshi
Sakshi News home page

నరేంద్ర మోడీకి పాక్ ప్రధాని లేఖ

Published Wed, Jun 11 2014 11:04 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

నరేంద్ర మోడీకి పాక్ ప్రధాని లేఖ - Sakshi

నరేంద్ర మోడీకి పాక్ ప్రధాని లేఖ

న్యూఢిల్లీ: పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఇటీవల భారత పర్యటనకు వచ్చిన నవాజ్ షరీఫ్.. మోడీతో తాను జరిపిన చర్చలు సంతృప్తకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నింటిపై దృష్టిసారిస్తామని, మోడీతో కలసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నానని తెలిపారు.

మోడీ ప్రమాణ స్వీకారంలో పాల్గొనేందుకు నవాజ్ షరీఫ్తో పాటు సార్క్ దేశాధినేతలు ఢిల్లీ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరచుకోవడానికి అర్థవంతమైన చర్చలు జరిపామని షరీఫ్ ఉత్తరంలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement