ఆఫ్రికా నుంచి యూరప్ వెళ్తున్న ఓ ఓడలో అగ్ని ప్రమాదం జరగడంతో 94 మంది ప్రయాణికులు మరణించారు. వీరిలో పిల్లలు, మహిళలు ఉన్నారు. 150 మందిని రక్షించగా, మరో 200 మంది జాడ కోసం అన్వేషిస్తున్నారు. గురువారం ఇటలీ ద్వీపకల్పం లాంపెడుసా సమీపంలో ప్రమాదకరమైన మెడీటెరనీన్ సముద్రంలో ఈ సంఘటన జరిగింది.
ఘనా, సోమాలియా, డి మిల్లాకు చెందిన దాదాపు 500 మంది ప్రయాణికులను తీసుకుని ట్రిపోలి నుంచి ఓడ బయల్దేరింది. ప్రమాదానికి గురైన వారందరూ ఆఫ్రికా ఖండానికి చెందినవారు. బతుకుతెరువు కోసం యూరప్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కొందరు ప్రయాణికులు ప్రాణాలు రక్షించుకునేందుకు సముద్రంలోకి దూకారు. వీరిలో కొందరిని రక్షించగా, మిగిలినవారి కోసం సముద్ర గస్తీ నౌకలు, చేపలు పట్టే పడవలు, హెలికాప్టర్ల సాయంతో సహాయక కార్యక్రమాలు చేపడుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని లాంపెడుసా ప్రజారోగ్య సంబంధాల అధికారి పీట్రో బర్తొలో చెప్పారు.
ఇటలీ దగ్గర ఓడలో అగ్ని ప్రమాదం, 94 మంది మృతి
Published Thu, Oct 3 2013 6:07 PM | Last Updated on Fri, Sep 1 2017 11:18 PM
Advertisement