జకర్తా: ఇండోనేసియాలోని సొలో నగరంలో సూసైడ్ బాంబర్ మోటార్ బైకుపై వెళ్లి పోలీస్ స్టేషన్పై దాడి చేశాడు. ఈ దాడిలో ఓ పోలీస్ అధికారి గాయపడ్డారు. మంగళవారం ఉదయం దుండగుడు పోలీస్ స్టేషన్ ఆవరణంలోకి చొరబడి బాంబు పేల్చుకున్నట్టు ఇండోనేసియా జాతీయ పోలీస్ ప్రతినిధి బాయ్ రఫ్లీ అమర్ చెప్పారు. ఈ ఘటనలో సూసైడ్ బాంబర్ హతమైనట్టు తెలిపారు. కాగా దాడికి పాల్పడింది ఎవరన్న విషయం తెలియరాలేదు.
ఇండోనేసియాలో జకర్తాలో గత జనవరిలో జరిగిన ఆత్మాహుతి దాడిలో నలుగురు పౌరులు, నలుగురు ఆత్మాహుతి దళ సభ్యులు మరణించారు. ఇండోనేసియాలో గత 15 ఏళ్లుగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు.
పోలీస్ స్టేషన్పై ఆత్మాహుతి దాడి
Published Tue, Jul 5 2016 8:34 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement