చైనాలో యోగా సన్నాహాలు
బీజింగ్: ప్రస్తుతం చైనాలో యోగా ఫీవర్ మొదలైంది. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. దేశంలోని గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, అనేక పార్కులు, రిసార్టుల్లో యోగా సన్నాహాలు ప్రారంభమయ్యాయి.
కున్‌మింగ్‌లోని యున్నాన్ మింజూ యూనివర్సిటీలోని యోగా కళాశాల పలు కార్యక్రమాలు నిర్వహించనుంది. ముఖ్య కార్యక్రమం గ్రేట్ వాల్ వద్ద జూన్ 20న నిర్వహిస్తారు. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లోని 92 వేల మంది ఖైదీలు జూన్ 21న యోగా కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే వీరికి యోగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.