అభిమానులతో అఖిల్ ముచ్చట్లు
అక్కినేని కుటుంబంలో నవ యువనటుడు అఖిల్ విడుదలకు సిద్ధమవుతున్న తన తొలి చిత్రం 'అఖిల్' విశేషాలను ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ముందుగా 'అఖిల్' చిత్ర రిలీజ్ డేట్ గ్రాఫిక్స్ వర్క్ కారణంగా వాయిదా పడిన విషయం చెబుతూ.. ఫైనల్ అవుట్పుట్ మీకు తప్పకుండా నచ్చుతుందని ట్వీట్ చేశారు. అభిమానులు ట్విట్టర్ లో అడిగిన ప్రశ్నలకు అఖిల్ సమాధానాలిచ్చారు. వాటిలో కొన్ని మీకోసం...
అభిమాని : 'అఖిల్' చిత్ర రిలీజ్ డేట్ వాయిదా మీదా చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి. మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది?
అఖిల్: రిలీజ్ వాయిదా వేయాలని రాత్రే నిర్ణయించారు. తిరిగి డేట్ ఫిక్స్ చేయడానికి కొంత టైం కావాలి. తప్పకుండా అది త్వరలోనే ఉంటుంది.
అభిమాని : 'అఖిల్' ఏ తరహా చిత్రంగా ఉండబోతుంది?
అఖిల్ : యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టెయినర్గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే కమర్షియల్ ఫార్ములాలోనే ఈ సినిమాను కాస్త డిఫరెంట్గా ప్రెజెంట్ చేయబోతున్నాం.
అభిమాని: ట్రైలర్లో చూసినదాన్ని బట్టి ఓ లక్ష్యాన్ని వెతుక్కోవడం చుట్టూ కథ తిరుగుతోందనిపిస్తోంది. ఏమంటారు?
అఖిల్: బేసికల్లీ.. ఈ సినిమాలో నేను హీరోయిన్ని రక్షిస్తాను. కానీ అసలైన లక్ష్యం మరొకటి ఉంటుంది. అది మీరు థియేటర్లోనే చూడాలి.
అభిమాని : ఈ సినిమా కోసం మీ ప్రిపరేషన్ గురించి చెప్పండి.
అఖిల్: సినిమా మొదలవ్వడానికంటే చాలా ముందు నుంచే నేను ప్రిపరేషన్ మొదలుపెట్టాను. ప్రత్యేకించి డ్యాన్స్ విషయంలో ఎక్స్ట్రా ట్రైనింగ్ తీసుకున్నాను.
అభిమాని : మూవీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాం. రూమర్స్ గురించి పట్టించుకోకండి.
అఖిల్ : థ్యాంక్యూ సో మచ్. మీ లవ్, సపోర్ట్ నాకు చాలా విలువైనవి. తప్పకుండా మీ అంచనాలను అందుకుంటాను.
అభిమాని : బ్రహ్మానందం గారికి, మీకు మధ్య కామెడీ ఎపిసోడ్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చా?
అఖిల్ : డెఫినెట్లీ.. ఈ మూవీలో బ్రహ్మానందం గారిది ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్. మీరు చాలా ఎంజాయ్ చేస్తారు.
అభిమాని : సినిమాలో మీ ఫేవరేట్ డైలాగ్ ఏది?
అఖిల్ : బ్రహ్మానందంగారితో నేను చెప్పే డైలాగ్.. 'జాన్సన్.. ప్రభు ఏ దారి చూపిస్తారు?'
అభిమాని : 'అఖిల్' సోషియో ఫ్యాంటసీ మూవీనా?
అఖిల్ : కాదు, కంప్లీట్ యాక్షన్ ఎంటర్టెయినర్. కానీ కథకు తగ్గట్టు 'సూర్యుడి శక్తి' లాంటి కొన్ని డిఫరెంట్ ఎలిమెంట్స్ చూస్తారు.
అభిమాని : వి.వి.వినాయక్ గారితో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి.
అఖిల్ : చాలా బావుంది. వినాయక్ గారు నన్ను సొంత కొడుకులా చూసుకున్నారు.