![అఖిల్.. బ్రహ్మి.. ఓ ఇంటర్వ్యూ! - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/71444651550_625x300.jpg.webp?itok=kLKvKORK)
అఖిల్.. బ్రహ్మి.. ఓ ఇంటర్వ్యూ!
వి.వి.వినాయక్ డైరెక్షన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న అఖిల్ అక్కినేని తొలిచిత్రం 'అఖిల్' విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రచారం ముమ్మరమైంది. ముందు నుంచి అఖిల్ సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులకు చేరువగా ఉంటున్నారు. ఇప్పుడు అదే దారిలో తాజాగా సినిమా మేకింగ్ వీడియో కోసం ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందంతో సరదాగా చేసిన ఓ ఇంటర్వ్యూను అఖిల్ పోస్ట్ చేశారు. సుమారు ఒకటిన్నర నిముషాల నిడివి గల ఈ ఇంటర్వ్యూ నవ్వులు పూయిస్తోంది.
సినిమా ప్రచారంలో ఇప్పుడు సోషల్ మీడియాదే ప్రధాన పాత్ర. 'అఖిల్' మూవీ తొలి పోస్టర్లు కూడా సోషల్ మీడియాలోనే విడుదల చేయడం జరిగింది. అలాగే అఖిల్ పుట్టిన రోజు సందర్భంగా 'అఖిల్' టీజర్ ను నాగార్జున తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆడియో విడుదలకు ముందే చిత్ర టైటిల్ సాంగ్ను అఖిల్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అభిమానులకు వినిపించాడు.
Had a blast interviewing Brahmanandam garu ! Here is the video https://t.co/krNCMJ7aSi
— Akhil Akkineni (@AkhilAkkineni8) October 12, 2015