బాలీవుడ్ మెగాస్టార్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ తరచూ కొత్త విషయాలను, సరదా సన్నివేశాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజన్లకు వినోదాన్ని అందిస్తుంటారు. అంతేగాక తనకు ఆశ్చర్యాన్ని కలిగించే ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకోవడం ఆయనకు అలవాటు. తాజాగా ఆయన ఓ కొత్త విషయాన్ని కనుగొన్నానంటూ ట్విటర్‌లో శుక్రవారం షేర్ చేశారు. ‘విభిన్న రంగుల హృదయాలకు వేర్వేరు అర్థాలు ఉన్నాయన్న విషయం ఇప్పటికీ నాకు తెలియదు. ఇప్పడే వాటి అర్థాలు తెలుసుకున్నాను.. వాటి అర్థాలను మరో ట్వీట్‌లో చూడండి’ అంటూ ట్వీట్ చేశారు.
ఆ హీరోను మరోసారి పొగిడిన అమితాబ్
T 3461 -never knew that heart Emoji's of different colours had different meanings .. SO , found out and here (cont) https://t.co/i1gaMCrclN
— Amitabh Bachchan (@SrBachchan) March 6, 2020
ఇక రంగుల హృదయాల అర్థాలను బిగ్‌బీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ‘రెడ్ హార్ట్: నిజమైన ప్రేమ, రొమాన్స్, ప్యాషన్(అభిరూచి); బ్లాక్ హార్ట్: రెడ్ హార్ట్‌కు పూర్తిగా వ్యతిరేకం.. బాధ; ఎల్లో హార్ట్: ఆనందం, స్నేహం; గ్రీన్ హార్ట్: అసూయ, ఆరోగ్యం, ఉత్సహాం; పర్పుల్ హార్ట్: కరుణ, ప్రేమ, ఈ హార్ట్‌తో దుస్తులు, స్నాప్‌లను ట్యాగ్ చేయడం; బ్లూ హార్ట్: నమ్మకం, సామరస్యం, శాంతి, విధేయత, అందరి దృష్టిని ఆకర్షించడం, సీతాకోక చిలుకలా హృదయం ఎగురుతుందని చెప్పడానికి, ఆహ్లదకరమైన అనుభూతి, హృదయ భావాలను తెలుపడానికి(ప్రేమను వ్యక్త పరచడం) అర్థం. ఇక ఎరుపు రంగు నిజమైన ప్రేమకు సూచిక కాబట్టి మీ అందరికి కావల్సింది ఎరుపు హృదయమే కదా ’ అని ఇన్‌స్టాలో రాసుకొచ్చారు.
కాగా పలు వాణిజ్య ప్రకటనలకు అంబాసిడర్‌గా ఉన్న బిగ్ బీ.. ప్రస్తుతం వరుస సినిమాలకు సైన్ చేసినట్లు సమాచారం. ఇక రణ్‌బీర్ కపూర్, అలియా భట్‌లు నటిస్తున్న బ్రహ్మాస్త్రా సినిమాలో ఆయన కీలక పాత్ర చేస్తున్నారు. అదేవిధంగా చెహ్రె, గులాబో సితాబో, జుంధ్ వంటి సినిమాలలో కూడా నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment