కల్చరల్ అంబాసిడర్‌గా....
జంట ఆస్కార్లు సాధించిన ఏఆర్ రెహమాన్ ప్రపంచమంతా పేరున్న సంగీత దర్శకుడు. తన సంగీతంతో ఖండాంతరాలకు విస్తరిస్తున్న ఈ స్వరకర్త ఇటీవలే ‘ప్రాఫెట్ ఆఫ్ మహమ్మద్’ అనే ఇరానీ చిత్రానికి సంగీతం అందించి ప్రపంచ సినీ అభిమానుల మనసు దోచుకున్నారు. తాజాగా ఆయనకు మరో గౌరవం దక్కింది. సీషెల్స్ ప్రభుత్వం తమ దేశ సాంస్కృతిక రాయబారిగా ఏఆర్ రెహ్మాన్‌ను నియమిస్తున్నట్టు ప్రకటించింది. ఆ దేశపు ప్రశంసా పత్రాన్ని రెహ్మాన్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సీషెల్స్‌కు సాంస్కృతిక రాయబారిగా అంతకుముందు ఇళయరాజా కొన్నేళ్లపాటు సేవలందించారు. ఆ తర్వాత ఎంపికైన వారిలో రెహమాన్ రెండో సంగీత దర్శకుడు.