ఫోర్బ్స్ జాబితాలో బాలీవుడ్ హీరోలు | Bollywood stars Salman Khan, Amitabh Bachchan, Akshay Kumar enter Forbes' list for first time | Sakshi
Sakshi News home page

ఫోర్బ్స్ జాబితాలో బాలీవుడ్ హీరోలు

Published Thu, Aug 6 2015 6:54 AM | Last Updated on Wed, Apr 3 2019 7:03 PM

ఫోర్బ్స్ జాబితాలో బాలీవుడ్ హీరోలు - Sakshi

ఫోర్బ్స్ జాబితాలో బాలీవుడ్ హీరోలు

న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఆర్జిస్తున్న సినీనటుల జాబితాలో ముగ్గురు బాలీవుడ్ సూపర్‌స్టార్లు టాప్-10లో చోటు దక్కించుకున్నారు. ప్రముఖ మేగజైన్ ఫోర్బ్స్ మొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మొత్తంలో ఆర్జిస్తున్న సినీనటుల జాబితాను విడుదల చేసింది. 2015 ఏడాదికి గాను రూపొందించిన ఈ జాబితాలో బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, సల్మాన్‌ఖాన్, అక్షయ్‌కుమార్‌లు టాప్-10లో నిలిచారు. 34 మంది గ్లోబర్ స్టార్స్‌తో కూడిన ఈ జాబితాలో షారుఖ్ ఖాన్, రణ్‌బీర్ కపూర్‌లూ చోటు దక్కించుకున్నారు.
    

  • అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్ గత ఏడాది సుమారు 33.5 మిలియన్ డాలర్లు ఆర్జించి, సంయుక్తంగా 7వ స్థానంలో నిలిచారు. హాలీవుడ్ సూపర్‌స్టార్లు ది రాక్ జాన్సన్, జానీ డెప్‌ల కన్నా వీరు అధికంగా సంపాదిస్తుడడం విశేషం.  
  • 32.5 మిలియన్ డాలర్ల వార్షిక సంపాదనతో అక్షయ్ కుమార్ హాలివుడ్ నటులు జార్జి క్లూనీ, బ్రాడ్‌పిట్‌లతో సంయుక్తంగా 9 స్థానంలో నిలిచాడు.
  •    బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్(26 మిలియన్ డాలర్లు) 18వ స్థానం దక్కించు కోగా, రణబీర్ కపూర్(15 మిలియన్ డాలర్లు) 30వ ర్యాంకులో నిలిచాడు.
  •  హాలీవుడ్ యాక్టర్ రాబర్ట్ డౌనీ జూనియర్ 80 మిలియన డాలర్లు సంపాదనతో అగ్రస్థానంలో నిలిచాడు. యాక్షన్ కింగ్ జాకీచాన్ రెండో స్థానం(50 మిలియన్   డాలర్లు) దక్కించుకున్నాడు. విన్ డీజెల్, బ్రాడ్లీ కూపర్, ఆడమ్ శాండ్లర్, టామ్ క్రూజ్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు.
  •  అమెరికా తర్వాత భారత్ నుంచి ఎక్కువ మంది జాబితాలో చోటు దక్కించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement