తమిళసినిమా: నటి విద్యాబాలన్ పాత్రను పోషించడానికి జ్యోతిక రెడీ అవుతున్నారన్నది తాజా సమాచారం. జ్యోతిక వివాహం చేసుకుని ఇద్దరు పిల్లల తల్లి అయిన తరువాత కూడా నటిగా తన ఇమేజ్‌ను కాపాడుకుంటూ వస్తుంది. కథానాయకిలా యువళగీతాలు పాడకపోయినా, అంత కంటే బలమైన పాత్రలను ఎంచుకుంటూ సక్సెస్ పయనాన్ని కొనసాగిస్తున్నారు. జ్యోతిక రీఎంట్రీ తరువాత 36 వయదినిలే, మగళీర్ మట్టుం చిత్రాలలో నటించారు. కాగా తాజాగా బాలా దర్శకత్వంలో నాచియార్ చిత్రంలో రఫ్ అండ్ టఫ్ పోలీస్ ఆధికారిగా టైటిల్ రోల్‌ను పోషించి మరో సారి తన సత్తా చాటుకున్నారు. కాగా జ్యోతిక తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు.
బాలీవుడ్‌లో విద్యాబాలన్ నాయకిగా నటించిన మంచి విజయాన్ని సాధించిన చిత్రం తుమ్హారి సుళు. ఈ చిత్ర తమిళ రీమేక్‌లో విద్యా పోషించిన పాత్రలో నటించడానికి రంగం సిద్ధం అవుతోందన్నది తాజా సమాచారం. ఓ మధ్యతరగతి కుటుంబ స్త్రీ ఆ తరువాత రేడీయో జాకీ స్థాయికి ఎలా ఎదిగిందనే పాత్రను విద్యాబాలన్ చాలా సమర్దవంతంగా నటించి పలు అవార్డులను అందుకున్నారు. ఈ చిత్రం విడుదలైన సమయంలోనే నటి జ్యోతిక చాలా మంచి చిత్రం. దీన్ని ఎవరు తమిళంలో రీమేక్ చేస్తారోగానీ అంటూ మెచ్చుకున్నారు. కాగా ఇప్పుడా పాత్రలో నటించే అవకాశం తననే వరించింది. చాలా కాలం క్రితం రాధామోహన్ దర్శకత్వంలో జ్యోతిక చెవిటి అమ్మాయి పాత్రలో నటించి అద్భుతమైన అభినయంతో ఆ చిత్ర విజయానికి కారణం అయ్యారు. తాజాగా హింది చిత్రం తుమ్హారి సుళు తమిళ రీమేక్ వీరిద్దరి కాంభినేషన్‌లో తెరకెక్కనుంది. అయితే ప్రస్తుతం జ్యోతిక మణిరత్నం దర్శకత్వంలో మల్టీస్టారర్ చిత్రం సెక్క సివంద వానం చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రం తరువాత తుమ్హారి సుళు రీమేక్‌లో నటించే అవకాశం ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment