‘అతడితో కలిసుండటం ఓ పీడకల’
ముంబయి: బాలీవుడ్‌లో హీరో హీరోయిన్ల మధ్య రూమర్లు సహజంగా వస్తుంటాయి. అయితే, కొన్ని రోమాంటికల్ విషయాల్లో..ఇంకొన్ని పంచాయితీలకు సంబంధించిన విషయాల్లో.. అందులో భాగంగానే ఇప్పుడు బాలీవుడ్‌లో ఓ గాసిఫ్ వినిపిస్తోంది. అదేమిటంటే బాలీవుడ్ డేరింగ్ హీరోయిన్ కంగనా రనౌత్, షాహిద్ కపూర్ మధ్య కోల్డ్ వార్ జరుగుతుందంట. రంగూన్ చిత్రంలో కలిసి నటించిన వీరిమధ్య కొన్ని కొన్ని అంశాలకు సంబంధించి అభిప్రాయభేదాయాలేర్పడి ఒకరిపై ఒకరు కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదే విషయంపై ప్రశ్నించిన మీడియాకు మాత్రం షూటింగ్ అంతా సజావుగా సాగిందని, కానీ ఒక్క కాటేజీల విషయంలోనే తమ మధ్య చిన్నచిన్న మనస్పర్థలు వచ్చాయని కంగనా చెప్పింది. ‘మేం కొంత షూటింగ్ అరుణాచల్ ప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతాల్లో చేశాం. అక్కడ కాటేజీలు చాలా తక్కువ. షాహిద్, నేను మా టీమ్స్‌తో వాటిని పంచుకోవాల్సి వచ్చింది.
ప్రతి రోజు ఉదయం నేను ఉదయాన్నే షాహిద్ కారణంగా నిద్ర లేవాల్సి వచ్చేది. అతడు ఓ మ్యూజిక్ పెట్టి వ్యాయామం చేస్తూ క్రీజీ టెక్నో పాటలు పెట్టి బాగా వాల్యూమ్ పెట్టేవాడు. ఆ స్పీకర్స్ సౌండ్ కారణంగా డిస్ట్రబ్ అయ్యేదాన్ని.. అతడితో కాటేజ్ పంచుకోకూడదని నిర్ణయించుకున్న. షాహిద్‌తో కాటేజ్ షేర్ చేసుకోవడం అంటే ఓ పీడకల’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు.