ఎమ్మెల్సీ ఫైర్‌.. గప్‌ చుప్‌గా షారూఖ్‌ జంప్‌ | MLC Jayant Patil fire on SRK | Sakshi
Sakshi News home page

షారూఖ్‌పై మండిపడ్డ ఎమ్మెల్సీ

Published Sun, Nov 12 2017 2:24 PM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM

MLC Jayant Patil fire on SRK  - Sakshi

సాక్షి, ముంబై : బాలీవుడ్ నటుడు షారూఖ్‌ ఖాన్‌ ఉన్న క్రేజ్‌ ఏంటో తెలియంది కాదు. సినిమా సక్సెస్‌లతో సంబంధం లేకుండా ఆయన కోసం అభిమానులు ఎగబడిపోతుంటారు. అయితే ఆ హడావుడే ఒక్కోసారి ప్రజలకు ఇబ్బందులు కూడా కలగజేస్తుంది కూడా.

తాజాగా ఆయన తన 52వ పుట్టినరోజు వేడుకలను ఫ్రెండ్స్‌ తో  సరదాగా అలీబాగ్‌లో జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బోటింగ్‌ పాయింటింగ్‌ వద్ద షారూఖ్ సందడి చేశాడు. బోట్‌లో కూర్చుని అభిమానులకు అభివాదం చేస్తూ కనిపించాడు. అయితే ఆయన వచ్చాడని తెలిసిన పోలీసులు భారీ ఎత్తున్న భద్రత కల్పించగా.. ప్రయాణికులు సుమారు 20 నిమిషాలపాటు ఇబ్బంది ఎదుర్కున్నారు. 

ఆ సమయంలో ఎమ్మెల్సీ జయంత్‌ పాటిల్‌ కూడా బోటింగ్ చేయాల్సి ఉంది. ఇంతలో షారూఖ్‌ వ్యవహారాన్ని గమనించిన ఆయనకు బాగా మండిపోయింది. భద్రతా సిబ్బందిని తోసుకుంటూ ముందుకు వెళ్లబోతుండగా.. వారు ఆయన్ని అడ్డగించారు. ఇంతలో ఓ పోలీస్‌ అధికారి ఆయన్ని గుర్తుపట్టి ముందుకు వదిలారు. ఇక బోట్‌ ఎక్కిన అనంతరం ఆయన షారూఖ్‌పై విరుచుకుపడ్డారు. ‘‘నువ్వు సూపర్‌స్టార్ కావొచ్చు. కానీ, అలీబాగ్‌ నీ సొత్తు కాదు అంటూ అగ్గిమీద గుగ్గిలం అవ్వటం ఆ వీడియోలో ఉంది.  వెంటనే షారూఖ్‌ బోట్ బయటికి వచ్చేసి అక్కడి నుంచి నిష్క్రమించటం గమనించవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement