నాగ్ 'ఊపిరి' డేట్ కన్ఫాం | oopiri to release worldwide on March 25 | Sakshi
Sakshi News home page

నాగ్ 'ఊపిరి' డేట్ కన్ఫాం

Published Fri, Feb 19 2016 12:36 PM | Last Updated on Fri, Jul 12 2019 4:40 PM

నాగ్ 'ఊపిరి' డేట్ కన్ఫాం - Sakshi

నాగ్ 'ఊపిరి' డేట్ కన్ఫాం

చెన్నై: క్రేజీ కాంబినేషన్లో పీవీపీ సంస్థ నిర్మిస్తున్న ద్విభాషా చిత్రం  విడుదల తేదీ ఖరారైంది. తెలుగులో 'ఊపిరి' పేరుతో వస్తున్న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా మార్చి 25న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్  నిర్ణయించింది.   దీంతో పాటుగా ఆడియో లాంచ్, టీజర్ విడుదలకు సంబంధించిన వివరాలను వెల్లడి  చేసింది. చిత్రి యూనిట్ విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది.  ఈ శనివారం టీజర్ రిలీజ్, అనంతరం ఫిబ్రవరి 26న ఆడియో లాంచ్ ఉంటుందని తన ప్రకటనలో తెలిపింది.


కాగా కింగ్‌ నాగార్జున, 'ఆవారా' కార్తీ, తమన్నా భాటియా, జయసుధ, ప్రకాష్‌రాజ్‌, కల్పన, ఆలీ, తనికెళ్ళ భరణిలతోపాటు ప్రముఖ నటీనటులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్‌కు వంశీ పైడిపల్లి దర్శకుడు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌కి  మంచి రెస్పాన్స్‌ వచ్చింది. దేశ విదేశాల్లో కలర్ ఫుల్ లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకున్న  ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మరోవైపు ఇది కార్తీ కి ఫస్ట్‌ స్ట్రెయిట్‌   తెలుగు సినిమా . ఎమోషనల్‌ జర్నీగా తెరకెక్కిన  'ఊపిరి' నాగార్జున కెరీర్‌లో డెఫినెట్‌గా మరో మెమరబుల్‌ మూవీ అవుతుందని చిత్ర యూనిట్ నమ్ముతోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement