![ఆయన చిత్రాన్ని మిస్ కాను: సాయిపల్లవి - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/5/81501416621_625x300.jpg.webp?itok=0fGyPmSU)
ఆయన చిత్రాన్ని మిస్ కాను: సాయిపల్లవి
శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రం చూసిన తెలుగు ప్రేక్షకులు సాయిపల్లవి నటనకు ఫిదా అవుతున్నారు. తాజాగా కోలీవుడ్‌లోనూ విజయ్ దర్శకత్వంలో కరు అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం తరువాత తమిళంలో వరుసగా చిత్రాలు చేయాలని నిర్ణయించుకుందట. దీంతో ఇక్కడ అవకాశాల వేట మొదలెట్టిందని సమాచారం. అందులో భాగంగా తాను కాలేజీ చదువుతున్న రోజుల్లోనే నటుడు సూర్యాకు వీరాభిమానిననీ, ఆయన చిత్రాలు మిస్ కాకుండా చూస్తాననీ డప్పు కొట్టుకుంటోంది. అంతే కాదు సూర్యతో రొమాన్స్ చేసే అవకాశం ఎప్పుడు వచ్చినా అందుకు రెడీగా ఉన్నాననీ అంటోంది. ఇక నీకు ఇష్టమైన నటి ఎవరని అడిగితే వెంటనే ఇంకెవరు అనుష్కనే అని ఠక్కున చెప్పింది. మాలీవుడ్‌లో ప్రేమమ్‌తోనూ,టాలీవుడ్‌లో ఫిదా చిత్రంతోనూ తన లక్‌ను నిరూపించుకున్న సాయిపల్లవి కోలీవుడ్‌లో కరు చిత్రం కోసం ఎదురు చూస్తోంది.