ఆయనకు 53 ఏళ్లా.. కాదు 25 | Salman Khan Doing a Back Flip into the Pool at 53 is Proof He is Still a Child at Heart | Sakshi
Sakshi News home page

ఆయనకు 53 ఏళ్లా.. కాదు 25

Published Sat, Jun 22 2019 8:57 AM | Last Updated on Sat, Jun 22 2019 9:18 AM

Salman Khan Doing a Back Flip into the Pool at 53 is Proof He is Still a Child at Heart - Sakshi

సాక్షి, ముంబై : బాలీవుడ్‌  కండల వీరుడు సల్మాన్‌ఖాన్ తన అభిమానులను భలే ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల భారీ కసరత్తులు, ఫిట్‌నెస్‌కు సంబంధించిన అసాధారణ వీడియోలను సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తూ అభిమానులను సర్‌ప్రైజ్‌ చేస్తున్నాడు. తాజాగా అలాంటి మరో వీడియోను పోస్ట్‌ చేసిన అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఈత కొలనులోకి రివర్స్‌ డైవ్‌(బ్యాక్ ఫ్లిప్) చేసిన వీడియోను షేర్‌ చేయడంతో వైరల్‌ అయింది. పూల్ ప్రక్కనే ఉన్న రాళ్ళపైకి ఎక్కి మరీ కొలనులోకి దూకడం ఈ వీడియోలో ఉంది. ఇది  చూసిన ఆయన అభిమానులు, స్నేహితులు  సల్మాన్‌ ఫిట్‌నెస్‌కు ఫిదా అయిపోతున్నారు. సల్మాన్‌కా 53 ఏళ్లా కాదు... 25 అని కమెంట్‌ చేస్తున్నారు.

కాగా సల్మాన్‌ ఖాన్‌ తన లేటెస్ట్‌ మూవీ భారత్‌  భారీ విజయాన్ని ఎంజాయ్‌ చేస్తున్నాడు. బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ ఏడాది యూరీ తర్వాత భారీ వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా భారత్ నిలిచిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. సల్మాన్‌తోపాటు కత్రినా కైఫ్, దిషా పటాని, జాకీష్రాఫ్, సోనాలి కులకర్ణి, సునీల్ గ్రోవర్ నటించిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement